ఫోన్లు పోవడం అనేది సహజంగానే జరుగుతుంటుంది. మన అజాగ్రత్త వల్ల లేదంటే మనం ఏమరుపాటుగా ఉన్నప్పుడు దొంగలు కొట్టేయడం వల్ల.. ఫోన్లు పోతుంటాయి. ఈ క్రమంలో అందులో ఉండే డేటా గురించే మనకు బెంగ పట్టుకుంటుంది. ముఖ్యంగా యూపీఐ యాప్‌ల గురించి భయం చెందుతారు. వాటిని ఓపెన్ చేసి అకౌంట్ల ద్వారా డబ్బులను దొంగిలిస్తే ఎలా ? అని దిగులు పడతారు. అయితే కింద తెలిపిన స్టెప్స్ ను పాటిస్తే మీ ఫోన్‌లో ఉండే పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే అకౌంట్లను సులభంగా బ్లాక్ చేయవచ్చు. మరి ఆ స్టెప్స్ ఏమిటంటే..
స్టెప్ 1: ఫోన్ పోయిన వెంటనే వేరే నంబర్ నుంచి 18004190157 అనే హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేయాలి.
స్టెప్ 2: కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. గూగుల్ పే అకౌంట్‌ను బ్లాక్ చేయమని చెప్పాలి.
స్టెప్ 3: ఆండ్రాయిడ్ యూజర్లు అయితే ఫైండ్ మై ఫోన్ ద్వారా గూగుల్ అకౌంట్‌లోని డేటాను రిమోట్ వైప్ చేయవచ్చు. దీంతో ఫోన్‌లోని డేటా డిలీట్ అవుతుంది. ఇలా గూగుల్ పే అకౌంట్‌ను బ్లాక్ చేయవచ్చు.
స్టెప్ 1: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ హెల్ప్ లైన్ నంబర్ 01204456456 కు కాల్ చేయాలి.
స్టెప్ 2 : లాస్ట్ ఫోన్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
స్టెప్ 3: ఆల్టర్‌నేటివ్ నంబర్‌ను ఎంటర్ చేసే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. పోయిన ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
స్టెప్ 4: పేటీఎం వెబ్‌సైట్‌ను సందర్శించి అందులో ఉండే 24×7 help ను ఎంచుకోవాలి. అక్కడ ఉండే రిపోర్ట్ ఫ్రాడ్‌ను ఎంచుకోవాలి.
స్టెప్ 5: మెసేజ్ అస్ అనే బటన్‌పై క్లిక్ చేయగానే ఓనర్‌షిప్ ప్రూఫ్ అడుగుతుంది. అక్కడ పేటీఎం లావాదేవీలను చూపే స్టేట్ మెంట్ ను ఇవ్వాలి. పోయిన ఫోన్ గురించి పోలీసులకు ఇచ్చిన కంప్లెయింట్‌ను చూపాలి. లేదా సంబంధిత పత్రాలను చూపాలి.
స్టెప్ 6: వెరిఫికేషన్ అనంతరం మీ పేటీఎం అకౌంట్‌ను బ్లాక్ చేస్తారు.
స్టెప్ 1: ఫోన్‌పే వినియోగదారులు 08068727374 అనే హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేయాలి.
స్టెప్ 2: మీ ఫోన్‌పే అకౌంట్‌లో ఏదైనా సమస్య ఉంటే రిపోర్టు చేయమని అడుగుతారు. అక్కడ సరైన ఆప్షన్ నంబర్‌ను ఎంచుకోవాలి.
స్టెప్ 3: రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను, ఓటీపీని వెరిఫికేషన్ కోసం ఎంటర్ చేయాలి.
స్టెప్ 4: ఓటీపీ పొందే సదుపాయం లేదని ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. అక్కడ సిమ్ కార్డు పోయిందని ఆప్షన్ ను ఎంచుకోవచ్చు.
స్టెప్ 5: ఈ విధానాన్ని అనుసరించాక బ్లాక్ ది అకౌంట్ అనే రిక్వెస్ట్‌ను ప్రారంభిస్తారు. దీంతో అకౌంట్ బ్లాక్ అవుతుంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…