వంట గ్యాస్ సిలిండర్‌లో గ్యాస్ ఎప్పుడు అయిపోతుందో సాధారణంగా ఎవరికీ తెలియదు. అందుకని చాలా మంది రెండు సిలిండర్లను పెట్టుకుంటారు. ఒకటి అయిపోగానే ఇంకొకటి వాడవచ్చని చెప్పి చాలా మంది డబుల్ సిలిండర్లను వాడుతుంటారు. అయితే సిలిండర్‌లో గ్యాస్ ఎంత ఉందో కింద ఇచ్చిన సులభమైన ట్రిక్ ద్వారా ఇట్టే తెలుసుకోవచ్చు. మరి ఆ ట్రిక్ ఏమిటంటే..
ఒక వస్త్రాన్ని బాగా తడిపి గ్యాస్ సిలిండర్ చుట్టూ చుట్టాలి. పూర్తిగా కప్పేలా వస్త్రాన్ని చుట్టాలి. 2 నిమిషాల పాటు ఉంచి తీసేయాలి. దీంతో సిలిండర్ మొత్తం పైన తడిగా ఉంటుంది.
అయితే కొంత సేపు ఆగాక చూస్తే సిలిండర్‌పై కొంత భాగం పొడిగా మారుతుంది. తడి మొత్తం పోతుంది. సిలిండర్ లో గ్యాస్ లేని భాగం మొత్తం వేడిగా ఉంటుంది. అందుకే బయటి వైపు తడి త్వరగా ఆరిపోతుంది. సిలిండర్‌లో గ్యాస్ ఉన్న భాగంలో కొంచెం చల్లగా ఉంటుంది. అందుకనే బయటి వైపు సిలిండర్‌పై తడి త్వరగా ఆరదు. దీంతో తడి భాగం ఎక్కడి వరకు ఉందో గమనిస్తే చాలు.. అంత వరకు సిలిండర్‌లో గ్యాస్ ఉన్నట్లు లెక్క. ఇలా సిలిండర్‌లో గ్యాస్ పరిమాణాన్ని తెలుసుకోవచ్చు.
అయితే గ్యాస్ అయిపోతుంటే మంట నీలి రంగులో కాక పసుపు రంగులో కనిపిస్తుంది. ఇలా కూడా గ్యాస్ అయిపోతుందని తెలుసుకోవచ్చు. కానీ స్టవ్ బర్నర్ సరిగ్గా లేకపోయినా మంట నీలి రంగులో రాదు, కనుక ముందు బర్నర్‌ను శుభ్రం చేయాలి. తరువాత కూడా మంట పసుపు రంగులోనే వస్తుంటే అప్పుడు నిజంగానే గ్యాస్ అయిపోతున్నట్లు గుర్తించాలి. ఇక కొందరు సిలిండర్‌ను పైకి ఎత్తడం ద్వారా కూడా అందులో గ్యాస్ ఎందో కొలుస్తారు. కానీ దీని ద్వారా సరిగ్గా తెలియదు. ప్రాక్టీస్ ఉండాలి. అన్నింటిలోకి పైన తెలిపిన చిట్కానే ఉత్తమం. దాంతో సిలిండర్‌లో గ్యాస్ ఎంత ఉందో సులభంగా తెలుసుకోవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…