Gold Rules : ఇన్‌క‌మ్ ట్యాక్స్ రూల్స్ మారాయి.. బంగారం ఇక ఎక్కువ ఉంటే అంతే..!

April 25, 2024 7:18 PM

Gold Rules : భార‌తీయుల‌కు ఇష్ట‌మైన వాటిలో బంగారం కూడా ఒక‌టి. పండుగ‌ల‌కు, పెళ్లిళ్ల‌కు, ఇత‌ర ముఖ్య సంద‌ర్భాల‌ల్లో బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాగే బంగారం అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో చాలా ఉప‌యోగ‌క‌రంగా కూడా ఉంటుంది. బంగారాన్ని ఎక్కువ‌గా దిగుమ‌తి చేసుకునే దేశాల‌ల్లో భార‌త‌దేశం కూడా ఒక‌టి. దేశంలోని దాదాపు ప్ర‌తి కుటుంబంలో ఎంతో కొంత బంగారం ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. నాణెలు, బిస్కెట్లు, ఆభ‌ర‌ణాలు ఇలా ఏదో ఒక రూపంలో ప్ర‌తి కుటుంబం ఎంతో కొంత బంగారాన్ని క‌లిగి ఉంటుంది. అలాగే బంగారం కొంద‌రు పెట్టుబ‌డిగా కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా బంగారాన్ని మ‌న దేశంలో అదృష్టంగా, ల‌క్ష్మీదేవి స్వ‌రూపంగా భావిస్తూ ఉంటారు. అయితే మ‌న ఇంట్లో ఉంచుకునే బంగారానికి ఒక నిర్దిష్ట ప‌రిమితి ఉంటుంది.

ఇంట్లో ఉండే ఈ విలువైన లోహాన్ని నిల్వ చేయ‌డానికి సంబంధించిన అన్ని విష‌యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్( సిబిడిటి) ప్ర‌కారం వెల్ల‌డైన ఆదాయ వ‌నురుల‌తో, వ్య‌వ‌సాయ ఆదాయంతో, చ‌ట్ట‌బ‌ద్దంగా సంక్ర‌మించిన డ‌బ్బు, ఇంటి పొదుపుతో కొనుగోలు చేసిన బంగారానికి ప‌న్ను విధించ‌బ‌డ‌దు. అలాగే అవివాహిత స్త్రీ 250 గ్రాములు, అవివాహితుడు 100గ్రాములు, వివాహిత స్త్రీ 500గ్రాములు, వివాహితుడు 100గ్రాముల బంగారాన్ని వారి వ‌ద్ద ఉంచుకోవ‌చ్చు. ఈ విధంగా నిర్దిష్ట మొత్తంలొ బంగారం మన ద‌గ్గ‌ర ఉంటే ఆదాయ‌పు ప‌న్ను అధికారులు కూడా ఈ బంగారాన్ని మ‌న ద‌గ్గ‌ర నుండి తీసుకోలేరు. బంగారాన్ని భ‌ద్ర‌త క‌ల్పించ‌డంతో పాటు ఈ లోహాన్ని ఇంట్లో నిల్వ ఉంచుకోవ‌డానికి సంబంధించిన ప్ర‌భుత్వ నియ‌మాల‌ను ప్ర‌తి ఒక్క‌రు తెలుసుకోవ‌డం చాలా మంచిది.

Gold Rules changed know how much you can keep with home
Gold Rules

పెళ్లి అయిన స్త్రీలు 500గ్రాముల బంగారాన్ని క‌లిగిఉండ‌వ‌చ్చు. పెళ్లి కాని స్త్రీలు త‌మ ద‌గ్గ‌ర 250గ్రాముల బంగారాన్ని ఉంచుకోవ‌చ్చు. అలాగే పురుషులు త‌మ వ‌ద్ద 100గ్రాముల బంగారాన్ని ఉంచుకోవ‌చ్చు. ఇక కొనుగోలు చేసిన మూడేళ్ల లోపు బంగారాన్ని విక్ర‌యిస్తే ఆదాయపు ప‌న్ను స్లాబ్ రేట్ల వ‌ద్ద ప్వ‌ల్ప‌కాలిక మూల‌ధ‌న లాభాల ప‌న్ను ఉంటుంది. కొనుగోలు చేసిన మూడు సంవ‌త్స‌రాల కంటే ఎక్కువ కాలం తర్వాత విక్రయించిన బంగారం దీర్ఘ‌కాలిక మూల‌ధ‌న లాభాల ప‌న్నును ఆక‌ర్షిస్తుంది. మూల‌ధ‌న లాభాల‌పై ఇండెక్సేష‌న్ ప్ర‌యోజ‌నంతో పాటు 4 శాతం సెస్ తో 20 శాతం ప‌న్ను విధించ‌బ‌డుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now