ప్రధానమంత్రి నిరుపేద కుటుంబాలకి ఉచితంగా ఎల్‌పీజీ కనెక్షన్, సిలిండర్ ఇవ్వడం కోసం ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా ఎంతో మంది నిరుపేద మహిళలు ఉచితంగా గ్యాస్ సిలిండర్ కనెక్షన్లను పొందారు. ఈ పథకం మొదటి దశ విజయవంతం కావడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉజ్వల 2.0 పథకం ప్రారంభించారు. ఈ క్రమంలోనే నిరుపేద మహిళలు ఈ పథకానికి అప్లై చేసుకుని ఉచితంగా గ్యాస్ సిలిండర్ కనెక్షన్లను పొందవచ్చు.
కేంద్ర ప్రభుత్వం దారిద్య్రరేఖకు దిగువున ఉన్న ఐదు కోట్ల మంది మహిళలకు ఉచితంగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే రెండవ విడతలో భాగంగా 8 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్ల ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ పొందాలంటే ఏ విధమైన అర్హతలు ఉండాలి, ఈ పథకానికి ఏ విధంగా అప్లై చేయాలి ? అనే విషయానికి వస్తే..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకానికి కేవలం 18 సంవత్సరాలు నిండిన మహిళలు మాత్రమే అర్హులు. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి రేషన్ కార్డ్ కలిగిన వారు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. అయితే వారి కుటుంబంలో ఎవరి పేరు మీద గ్యాస్ కనెక్షన్ లేకపోతేనే ఈ పథకానికి అర్హులు. వలస కార్మికులు కూడా ఈ పథకానికి అర్హులుగా ప్రకటిస్తూ వారు ఏ విధమైన ఆధారాలు ఇవ్వకుండానే గ్యాస్ కనెక్షన్ పొందవచ్చని తెలియజేశారు.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఆన్‌లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దగ్గరలో ఉన్న ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీకి వెళ్లి అప్లికేషన్ ఫామ్ ఇవ్వాలి. ఒకవేళ ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలంటే https://pmujjwalayojana.com వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకొని, పూర్తి చేసి ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలో ఇస్తే సరిపోతుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…