గూగుల్ తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ పిక్సల్ 10ను కొనాలనుకున్నప్పటికీ ధర కారణంగా వెనకడుగు వేసిన వారికి శుభవార్త. పిక్సల్ 10 ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. భారత్‌లో ప్రారంభ ధర రూ.79,999గా ఉన్న ఈ ఫోన్‌పై ప్రస్తుతం రూ.13,000కు పైగా తగ్గింపు లభిస్తోంది. క్లీన్ ఆండ్రాయిడ్ అనుభవం, శక్తివంతమైన కెమెరా వ్యవస్థ, ఏఐ ఆధారిత ఫీచర్లతో పిక్సల్ 10 ఫ్లాగ్‌షిప్ విభాగంలో బలమైన పోటీదారుగా నిలుస్తోంది. ఇలాంటి ఆఫర్లు ఎక్కువ కాలం ఉండవని నిపుణులు చెబుతున్నారు.
గూగుల్ పిక్సల్ 10ను అమెజాన్ లో ప్రస్తుతం రూ.70,420కి లిస్ట్ చేశారు. అంటే అంతకు ముందు ఉన్న ధరతో పోలిస్తే నేరుగా రూ.9,579 తగ్గినట్లు అర్థమవుతోంది. అలాగే అదనంగా యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై మరో రూ.3,500 డిస్కౌంట్ లభిస్తోంది. పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే మరింత తగ్గింపు పొందే అవకాశం కూడా ఉంది. ఈ విధంగా ఈ ఫోన్‌పై ఏకంగా రూ.13వేలకు పైగా డిస్కౌంట్‌ను వినియోగదారులు పొందవచ్చు.
ఇక గూగుల్ పిక్సల్ 10 ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో గూగుల్ రూపొందించిన టెన్సార్ జి5 చిప్‌సెట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 12జీబీ వరకు ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజ్ లభిస్తున్నాయి. 4,970ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఉంది. దీనికి 30 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్, 15 వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ను కూడా ఇచ్చారు. ఈ ఫోన్ 6.3 ఇంచుల ఓలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ను ఇస్తున్నారు. గరిష్టంగా 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇస్తుంది. స్క్రీన్‌కు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో వెనుక వైపు 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా ఇది మాక్రో ఫోకస్ తో పనిచేస్తుంది. అలాగే 13 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. దీంతో 5ఎక్స్ ఆప్టికల్ జూమ్ లభిస్తుంది. ముందు భాగంలో 10.5 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు.
గమనిక: గూగుల్ పిక్సల్ 10 ఫోన్‌ను కొనాలని చూస్తున్న వారికి ఇది చక్కని ఆఫర్‌గా చెప్పవచ్చు. ఆఫర్ పరిమిత కాలం పాటు మాత్రమే ఉంటుంది కనుక వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు అమెజాన్‌లో ఫోన్ పేజీని సందర్శించి డిస్కౌంట్లు, ఆఫర్లను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
థియేటర్లలో మిస్ అయిన సినిమాలు అన్నీ ఓటీటీల్లో రిలీజ్ అవుతుండడంతో ప్రేక్షకులు కూడా ఈ ప్లాట్‌ఫామ్‌కు బాగా అలవాటు పడ్డారు.…
తనను విమర్శించే వారిని పట్టించుకోవడం ఎప్పుడో మానేశానని నటి, నిర్మాత కొణిదెల నిహారిక అన్నారు. తన సొంత బ్యానర్‌పై తెరకెక్కుతున్న…
సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు భిన్న రకాల ప్లాట్‌ఫామ్‌లలో అకౌంట్లను ఓపెన్ చేసి తమ అభిమానులతో…
తల్లినయ్యాక తన జీవితాన్ని చూసే విధానమే మారిపోయిందని బాలీవుడ్ నటి కియారా అద్వానీ తెలిపింది. హీరోలకు దీటుగా యాక్షన్ సన్నివేశాల్లో…
బ్యాటింగ్‌లో పవర్ ప్లేలో ఎదురైన సమస్యలు, ప్రభావవంతం కాని బౌలింగ్ వల్లనే సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఐపీఎల్…
రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసి వసూళ్లలో దూసుకెళ్తోంది.…
అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యులని అందరికీ తెలిసిందే. అయితే ఆయనకు డ్యాన్స్ నేర్పింది తానేనని సీనియర్…
ప్రస్తుతం తన ధ్యాస, దృష్టి అంతా సినిమాలపైనే ఉందని, ఇప్పట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేదని నటి సాయిపల్లవి స్పష్టం…