గ్యాడ్జెట్స్

ఎంఐ 11ఎక్స్, ఎంఐ 11ఎక్స్ ప్రొ ఫోన్ల‌ను విడుద‌ల చేసిన షియోమీ..!

మొబైల్స్ త‌యారీదారు షియోమీ.. ఎంఐ 11ఎక్స్‌, 11ఎక్స్ ప్రొ పేరిట రెండు కొత్త స్మార్ట్ ఫోన్ల‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. వీటిల్లో 6.67 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వీటికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల ఈ ఫోన్ల డిస్‌ప్లే క్వాలిటీ బాగుంటుంది. ఎంఐ11ఎక్స్ లో స్నాప్‌డ్రాగ‌న్ 870 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేయ‌గా, 11ఎక్స్ ప్రొ స్మార్ట్ ఫోన్‌లో స్నాప్‌డ్రాగ‌న్ 888 ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. రెండింటిలోనూ 8జీబీ ర్యామ్ ల‌భిస్తుంది.

ఎంఐ 11ఎక్స్ లో వెనుక వైపు 48 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా ఉండ‌గా, 11ఎక్స్ ప్రొ లో 108 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఇక 8 మెగా పిక్స‌ల్ అల్ట్రా వైడ్ సెన్సార్‌, 5 మెగాపిక్స‌ల్ టెలిఫోటో లెన్స్ రెండింటిలోనూ వెనుక వైపు ఉన్నాయి. డాల్బీ అట్మోస్‌, 4520 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఫీచ‌ర్ల‌ను వీటిల్లో అందిస్తున్నారు. ఈ ఫోన్ల‌కు ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్ ఉంది. క‌నుక వీటిని 52 నిమిషాల్లోనే 100 శాతం చార్జింగ్ చేయ‌వ‌చ్చు.

షియోమీ ఎంఐ 11ఎక్స్, ఎంఐ 11ఎక్స్ ప్రొ ఫీచ‌ర్లు

  • 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్
  • 2400 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్
  • ఎంఐ 11 ఎక్స్ – ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 870 ప్రాసెసర్
  • ఎం 11 ఎక్స్ ప్రొ – ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 888 ప్రాసెస‌ర్
  • 6/8 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 11 ఓఎస్
  • ఎంఐ 11ఎక్స్ – 48, 8, 5 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
  • ఎంఐ 11ఎక్స్ ప్రొ – 108, 8, 5 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
  • 20 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రా రెడ్ సెన్సార్
  • డాల్బీ అట్మోస్‌, 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.1
  • యూఎస్‌బీ టైప్ సి, 4520 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

షియోమీ ఎంఐ 11ఎక్స్‌, ఎంఐ 11ఎక్స్ ప్రొ స్మార్ట్ ఫోన్లు సెలెస్టియ‌ల్ సిల్వ‌ర్‌, లూనార్ వైట్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌ల‌య్యాయి. ఎంఐ11ఎక్స్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.29,999 గా ఉండ‌గా, 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.31,999గా ఉంది. ఏప్రిల్ 27వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను అమెజాన్‌తోపాటు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌, ఎంఐ హోమ్ స్టోర్స్‌లో విక్ర‌యిస్తారు.

ఎంఐ 11ఎక్స్ ప్రొ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.39,999 ఉండ‌గా, 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.41,999గా ఉంది. ఈ ఫోన్‌ను అమెజాన్‌తోపాటు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌, ఎంఐ హోమ్ స్టోర్‌ల‌లో విక్ర‌యిస్తున్నారు.

లాంచింగ్ సంద‌ర్బంగా ఈ ఫోన్ల‌పై ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల‌తో ఎంఐ 11ఎక్స్ ఫోన్‌పై రూ.3500, ఎంఐ 11ఎక్స్ ప్రొ ఫోన్‌పై రూ.4000 క్యాష్‌బ్యాక్‌ను పొంద‌వ‌చ్చు. ఎంఐ 11ఎక్స్‌ను కొన్న‌వారు ఎంఐ బ్యాండ్ 5 ను రూ.500 కే కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఐపీఎల్ ధాటికి పీఎస్‌ఎల్ విలవిల.. విదేశీ ప్లేయర్లు జంప్! పీసీబీ సీరియస్ వార్నింగ్..

పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…

Monday, 23 March 2026, 10:14 PM

4 రోజుల్లో రూ.411 కోట్లు.. ‘ధురంధర్ 2’ రికార్డుల వేట! విమర్శకులకు జయప్రద స్ట్రాంగ్ కౌంటర్..

రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…

Monday, 23 March 2026, 12:16 PM

ముంబై ఇండియన్స్ ప్రీ-సీజన్ ఈవెంట్‌లో రోహిత్ డ్యాన్స్.. హార్దిక్ జోడీ సందడి! వీడియో వైరల్..

ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…

Sunday, 22 March 2026, 8:38 PM

ఓటీటీలోకి వచ్చేసిన శ్రీవిష్ణు ‘విష్ణు విన్యాసం’.. ఎక్కడ చూడొచ్చంటే?

శ్రీ విష్ణు, నయనా సరిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన విష్ణు విన్యాసం చిత్రం ప్ర‌స్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వ‌చ్చింది.…

Sunday, 22 March 2026, 7:48 PM

‘ధురంధర్ 2’పై రమ్య స్పందన ఫైర్.. థియేటర్లో టైమ్ వేస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు!

నటి రమ్య‌ స్పందన త‌న సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…

Sunday, 22 March 2026, 12:56 PM

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM