మొబైల్స్ తయారీదారు షియోమీ.. ఎంఐ 11 అల్ట్రా పేరిట ఓ నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. ఇందులో 6.81 ఇంచుల అమోలెడ్ క్వాడ్ కర్వ్‌డ్ డాట్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్‌ప్లే క్వాలిటీ బాగుంటుంది. డిస్‌ప్లేకు డాల్బీ విజన్ సపోర్ట్‌ను కూడా అందిస్తున్నారు. దీనికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ లభిస్తుంది. ఇక 1.1 ఇంచుల సైజ్ ఉన్న మరో సెకండరీ అమోలెడ్ డిస్‌ప్లేను కూడా ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. దీని సహాయంతో నోటిఫికేషన్లు చెక్ చేయవచ్చు. సెల్ఫీలను ప్రివ్యూ చూడవచ్చు.
ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌ను అమర్చారు. 12 జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా మరో 48 మెగాపిక్సల్ అల్ట్రావైడ్ కెమెరా, 48 మెగాపిక్సల్ టెలిఫొటో కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌కు ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ లభిస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో ఏర్పాటు చేశారు. దీనికి 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 67 వాట్ల వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఈ ఫోన్ కేవలం 36 నిమిషాల్లోనే పూర్తిగా చార్జింగ్ అవుతుంది. ఇక ఫోన్‌తోపాటు 55 వాట్ల చార్జర్‌ను అందిస్తారు. 67 వాట్ల చార్జర్‌ను త్వరలోనే లాంచ్ చేయనున్నారు.
షియోమీ ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్ ఫోన్ సెరామిక్ బ్లాక్, సెరామిక్ వైట్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్ ధర రూ.69,999గా ఉంది. దీన్ని త్వరలోనే అమెజాన్‌తోపాటు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, ఎంఐ హోమ్ స్టోర్‌లలో విక్రయించనున్నారు.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…