మొబైల్స్ తయారీ సంస్థ వివో.. వై33ఎస్ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 6.58 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. మీడియాటెక్ హీలియో జి80 ప్రాసెసర్ లభిస్తోంది. 8 జీబీ ర్యామ్‌ను అందిస్తున్నారు. అవసరం అనుకుంటే ర్యామ్‌ను ఇంకో 4జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఈ ఫోన్‌లో వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంది. దీనికి తోడు మరో 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సల్ మాక్రో ట్రిపుల్ కెమెరాలు ఉన్నాయి. ముందు వైపు 16 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క వైపున ఉంది. దీంతో ఫోన్‌ను కేవలం 0.24 సెకన్ల వ్యవధిలోనే అన్‌లాక్ చేయవచ్చు.
ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 11 ఓఎస్ లభిస్తుంది. మల్టీ టర్బో 5.0, అల్ట్రా గేమ్ మోడ్ ఫీచర్లను గేమ్స్ ఆడే వారి కోసం అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తోంది.
128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి వంటి ఇతర ఫీచర్లు ఈ ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి.
వివో వై33ఎస్ స్మార్ట్ ఫోన్ ధర రూ.17,990గా ఉంది. వివో ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సైట్లలో, అన్ని రిటెయిల్ స్టోర్స్‌లో ఈ ఫోన్‌ను విక్రయిస్తున్నారు.
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…