మొబైల్స్ తయారీదారు రియల్‌మి.. నార్జో 30 5జి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. అందువల్ల డిస్‌ప్లే క్వాలిటీ బాగుంటుంది.
ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌ను అమర్చారు. అందువల్ల 5జి సేవలను పొందవచ్చు. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లో ఈ ఫోన్ లభిస్తుంది. మెమొరీని కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ లభిస్తుంది.
ఈ ఫోన్‌లో వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీనికి తోడు మరో 2 మెగాపిక్సల్ బ్లాక్ అండ్ వైట్ కెమెరా, ఇంకో 2 మెగాపిక్సల్ మాక్రో సెన్సార్‌లను అమర్చారు. ముందు వైపు 16 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క వైపుకు ఇచ్చారు. డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్ సి ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఇందులో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న భారీ బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.
రియల్‌మి నార్జో 30 5జి స్మార్ట్ ఫోన్ ధర రూ.15,999గా ఉంది. దీన్ని జూన్ 30 నుంచి విక్రయస్తారు. ఫ్లిప్‌కార్ట్‌తోపాటు రియల్‌మి ఆన్‌లైన్ స్టోర్, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్స్ లో ఈ ఫోన్‌ను కొనవచ్చు. మొదటి సేల్‌లో ఈ ఫోన్‌పై రూ.500 తగ్గింపును అందించనున్నారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…