బాలీవుడ్ బాద్ షా గా పేరు సంపాదించుకున్న నటుడు షారుక్ ఖాన్ ‘దివానా’చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేశారు.ఈ సినిమా తర్వాత షారుఖ్ ఖాన్ విజయవంతమైన సినిమాల్లో నటిస్తూ బాలీవుడ్ స్టార్ హీరోగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే షారుక్ నటించిన ‘దివానా’చిత్రం విడుదలయ్యి శుక్రవారంతో 29 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా హీరో షారుక్ ఖాన్ సరదాగా అభిమానులతో ముచ్చటించారు.
సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన షారుక్ ఖాన్ అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో సరదాగా సమాధానాలు తెలియజేశారు. ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు 29 సంవత్సరాలలో మీకు నచ్చినది ఏంటి అని ప్రశ్నించగా… అందుకు షారుక్ సమాధానం చెబుతూ.. నా జీవితంలో ఎంతో విలువైన సంవత్సరాలు ఇవి. వీటి సంఖ్య ఇంకా పెంచుకోవాలని తెలిపారు.
అదేవిధంగా మరొక అభిమాని ప్రేమలో విఫలమైతే దానిని తట్టుకుని ఎలా ముందుకెళ్లాలి అని ప్రశ్నించారు. అందుకు సమాధానంగా షారుక్ ఆ బాధను ఎప్పటికీ నువ్వు జయించ లేవు… దానిని జ్ఞాపకంగా మాత్రమే మిగుల్చుకోవాలంతే. బాధ నుంచి మరింత బలంగా మారడం ఎలాగో నేర్చుకోవాలని తెలిపారు. 2020 సంవత్సరం ఎలా గడిపారు అని ప్రశ్నించగా.. తక్కువ పని చేసి నా కుటుంబంతో ఎక్కువ గడిపాను అంటూ సరదాగా అభిమానులతో ముచ్చటించారు.
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…