బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ ప్రేమలో నటి శ్రద్ధా కపూర్ పడబోతోందా? అంటే అవుననే అంటోంది బాలీవుడ్ ఇండస్ట్రీ. అయితే వీరిద్దరూ నిజజీవితంలో ప్రేమలో పడుతున్నారా.. అని అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. తాజాగా కార్తీక్ ఆర్యన్ హీరోగా ‘సత్యనారాయణ్ కీ కథ’. అనే చిత్రం తెరకెక్కబోతోందని ఇదివరకే ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ సమాచారం బాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.సాజిద్ నడియాడ్‌వాలా నిర్మించనున్న ఈ చిత్రంలో కార్తీక్ సరసన కథానాయిక ఎవరు అనే విషయంపై స్పష్టత వచ్చింది. ఈ సినిమాలో కార్తీక్ సరసన నటి శ్రద్ధా కపూర్ అయితే బాగుంటుందని,వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మొదటి చిత్రం కావడంతో ఈ పాత్రకు శ్రద్ధ కపూర్ సరిగ్గా సరిపోతారని చిత్ర బృందం భావించారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి ఆమెతో సంప్రదింపులు జరిపగా, కథ నచ్చడంతో ఈ పాత్రలో నటించడానికి శ్రద్ధాకపూర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర చాలా కీలకమైనది. ఈ పాత్రకు శ్రద్ధ అయితేనే న్యాయం చేస్తుందని,సరికొత్త ప్రేమకథతో తెరకెక్కనున్న థ్రిల్లర్ చిత్రమిదని ఈ సందర్భంగా సాజిద్ నడియాడ్‌వాలా సన్నిహిత వర్గాలు చెప్పినట్టు సమాచారం.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…