మొబైల్స్ తయారీదారు ఇన్ఫినిక్స్ కొత్తగా నోట్ 10, నోట్ 10 ప్రొ పేరిట రెండు స్మార్ట్ ఫోన్లను భారత్ లో విడుదల చేసింది. ఇవి రెండూ 6.95 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ ఉన్న డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. వీటిల్లో ముందు భాగంలో 16 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. అయితే ప్రొ మోడల్ డిస్‌ప్లేకు 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. దీని వల్ల డిస్‌ప్లే క్వాలిటీ బాగుంటుంది.
నోట్ 10 లో హీలియో జి85 ప్రాసెసర్‌ను, నోట్ 10 ప్రొ లో హీలియో జి95 ప్రాసెసర్‌ను అందిస్తున్నారు. రెండింటిలోనూ 8జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. నోట్ 10 ఫోన్‌లో 48 మెగాపిక్సల్ బ్యాక్ మెయిన్ కెమెరాకు తోడుగా మరో 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాను ఏర్పాటు చేశారు. నోట్ 10 ప్రొ లో 64 మెగాపిక్సల్ బ్యాక్ మెయిన్ కెమెరాకు తోడుగా 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరాలు, 2 మెగాపిక్సల్ పోర్ట్రెయిట్ కెమెరా, 2 మెగాపిక్సల్ బ్లాక్ అండ్ వైట్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ రెండు ఫోన్లలోనూ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తుంది. వీటికి ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు.
ఇన్ఫినిక్స్ నోట్ 10 స్మార్ట్ ఫోన్ 7 డిగ్రీ పర్పుల్, 95 డిగ్రీ బ్లాక్, ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్‌కు చెందిన 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.10,999 ఉండగా, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.11,999గా ఉంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో జూన్ 13వ తేదీ నుంచి విక్రయిస్తారు.
ఇన్ఫినిక్స్ నోట్ 10 ప్రొ స్మార్ట్ ఫోన్ 7 డిగ్రీ పర్పుల్, 95 డిగ్రీ బ్లాక్, నోర్డిక్ సీక్రెట్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్ ధర రూ.16,999 ఉండగా దీన్ని కూడా జూన్ 13 వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించనున్నారు.
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించి ఇన్‌స్టాగ్రామ్‌లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…