టెక్నాల‌జీ

మీ స్మార్ట్ ఫోన్ వేగంగా, స్మూత్‌గా ప‌నిచేయాలంటే.. ఈ సూచ‌న‌లు పాటించండి..!!

స్మార్ట్ ఫోన్లు అనేవి ప్ర‌స్తుత త‌రుణంలో కామ‌న్ అయిపోయాయి. ప్ర‌తి ఒక్క‌రి చేతిలో స్మార్ట్ ఫోన్లు క‌నిపిస్తున్నాయి. వాటి వ‌ల్ల మ‌నం అనేక ప‌నులను చ‌క్క‌బెట్టుకోగ‌లుగుతున్నాం. బ్యాంకింగ్ వంటి ప‌నులను చేసుకోగ‌లుగుతున్నాం. ఇంకా ఎన్నో సౌక‌ర్యాల‌ను మ‌న‌కు స్మార్ట్ ఫోన్లు అందిస్తున్నాయి. అయితే కొన్ని సార్లు ప‌లు కార‌ణాల వ‌ల్ల ఫోన్లు నెమ్మ‌దిగా ప‌నిచేస్తుంటాయి. హ్యాంగ్ అవుతుంటాయి. అలాంటి స‌మ‌యాల్లో కింద తెలిపిన సూచ‌న‌లు పాటించాల్సి ఉంటుంది. దీంతో ఫోన్లు మ‌ళ్లీ వేగంగా, స్మూత్‌గా ప‌నిచేస్తాయి. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే…

1. ఫోన్ల‌లో యానిమేష‌న్ల‌ను ఆఫ్ చేయ‌డం వ‌ల్ల ఫోన్ వేగం పెరుగుతుంది. అందుకు గాను ఫోన్‌లోని సెట్టింగ్స్ లోకి వెళ్లి అందులో అడ్వాన్స్‌డ్ ఫీచ‌ర్స్ లో ఉండే రెడ్యూస్ యానిమేష‌న్స్ అనే ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. శాంసంగ్ ఫోన్ల‌లో ఇలా చేయ‌వ‌చ్చు. ఇక ఇత‌ర ఆండ్రాయిడ్ ఫోన్లు అయితే ముందుగా డెవ‌ల‌ప‌ర్ ఆప్ష‌న్స్‌ను ఎనేబుల్ చేయాలి. అందుకు గాను సెట్టింగ్స్‌లో అబౌట్ ఫోన్ విభాగంలో బిల్డ్ నంబ‌ర్‌ అనే ఆప్ష‌న్‌పై 7 సార్లు ట్యాప్ చేయాలి. దీంతో డెవ‌ల‌ప‌ర్ ఆప్ష‌న్స్ ఎనేబుల్ అవుతుంది. సెట్టింగ్స్‌లో ఉండే డెవ‌ల‌ప‌ర్ ఆప్ష‌న్స్‌లోకి వెళ్లి అక్క‌డ విండో యానిమేష‌న్ స్కేల్‌ రెడ్యూస్ అనే ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. ఆ విలువ‌ను 0.5ఎక్స్‌కు త‌గ్గించాలి. లేదంటే పూర్తిగా ఆఫ్ చేయ‌వ‌చ్చు. దీంతో ఫోన్ వేగంగా ప‌నిచేస్తుంది. స్మూత్‌గా ఆప‌రేట్ చేయ‌వ‌చ్చు.

2. ఫోన్ల‌లో చాలా మంది అవ‌స‌రం లేని యాప్స్‌ను వేస్తుంటారు. అలాగే వేల‌కొద్దీ ఫొటోలు, వీడియోలు, వాట్సాప్ చాట్‌లు సేవ్ అవుతుంటాయి. వీటి వ‌ల్ల ఫోన్ స్టోరేజ్ స్పేస్ త‌గ్గుతుంది. దీంతో ఫోన్ హ్యాంగ్ అవుతుంటుంది. క‌నుక అవ‌స‌రం లేని యాప్స్‌ను, డేటాను డిలీట్ చేయాలి. ఇది ఫోన్ వేగాన్ని పెంచుతుంది.

3. ఇన్‌స్టాగ్రామ్ వంటి సోష‌ల్ మీడియా యాప్స్ ను ఎక్కువ‌గా చూసినా లేదా యూట్యూబ్‌లో వీడియోల‌ను ఎక్కువ‌గా వీక్షించినా ఫోన్‌లో క్యాచ్ స్టోరేజ్ అవుతుంది. ఇది ఒక్కోసారి 2జీబీ వ‌ర‌కు అవుతుంది. క‌నుక దీన్ని ఎప్ప‌టిక‌ప్పుడు క్లియ‌ర్ చేసుకోవాలి. అందుకు గాను ఫోన్‌లో సెట్టింగ్స్‌లోని స్టోరేజ్ విభాగంలో క్యాచ్‌డ్ డేటాకు వెళ్లాలి. అక్క‌డ డిలీట్ క్యాచ్ ఆప్ష‌న్‌పై ట్యాప్ చేయాలి. దీంతో ఫోన్ క్యాచ్ క్లియ‌ర్ అవుతుంది. ఫోన్ వేగంగా ప‌నిచేస్తుంది.

4. కొంద‌రు ఫోన్ల‌లో యానిమేష‌న్లతో కూడిన వాల్‌పేప‌ర్ల‌ను వాడుతారు. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా ఫోన్ ప‌నితీరు మంద‌గిస్తుంది. క‌నుక సాధార‌ణ వాల్‌పేప‌ర్ల‌ను ఉప‌యోగించాలి. దీంతో ఫోన్ వేగంగా ప‌నిచేస్తుంది. స్మూత్‌గా ఆప‌రేట్ అవుతుంది.

5. ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ ఎందులో అయినా స‌రే హోం స్క్రీన్‌పై విడ్జెట్స్‌ను పెట్టుకునే స‌దుపాయం ఉంది. కానీ వీటి వ‌ల్ల ఫోన్ పెర్ఫార్మెన్స్ దెబ్బ తింటుంది. క‌నుక విడ్జెట్ల‌ను వీలైనంత వ‌ర‌కు వాడ‌క‌పోవ‌డ‌మే ఉత్త‌మం.

6. పైన తెలిపిన ఆప్ష‌న్ల‌ను ట్రై చేసిన‌ప్ప‌టికీ ఫోన్ ఇంకా హ్యాంగ్ అవుతున్నా లేదా స్మూత్‌గా ప‌నిచేయ‌కున్నా.. ఫోన్‌ను ఫ్యాక్ట‌రీ సెట్టింగ్స్‌కు రీసెట్ చేయ‌డం ఒక్క‌టే మార్గం. అలా కూడా ఫోన్ హ్యాంగ్ అవుతుంటే దాన్ని స‌ర్వీస్ సెంట‌ర్ లో చూపించాలి. కొన్ని సార్లు ఫోన్‌ల‌లో వైర‌స్‌, మాల్‌వేర్ చేర‌డం వ‌ల్ల కూడా ఫోన్ హ్యాంగ‌వుతుంది. ఇలా గ‌న‌క జ‌రుగుతున్న‌ట్లు భావిస్తే ఫోన్‌లో యాంటీ వైర‌స్‌, యాంటీ మాల్‌వేర్ యాప్స్ వేసి ఫోన్‌ను క్షుణ్ణంగా స్కాన్ చేయాలి. దీంతో వైర‌స్‌లు, మాల్‌వేర్‌లు తొల‌గిపోతాయి. ఫోన్ ఎప్ప‌టిలా మ‌ళ్లీ వేగంగా ప‌నిచేస్తుంది. స్మూత్‌గా ఆపరేట్ చేయ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM

2024 vs 2026.. ఏ వరల్డ్ కప్ విజయం గొప్పది? ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చ!

భార‌త టీ20ఐ క్రికెట్ జ‌ట్టు టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ…

Saturday, 14 March 2026, 8:31 PM

గ్యాస్, పెట్రోల్ కొరత రాదు.. కేంద్రం కీలక ప్రకటన! ఆ జలసంధి వద్ద టెన్షన్..

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…

Saturday, 14 March 2026, 7:22 PM

అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం.. ‘వాల్ ఆఫ్ గ్రేట్స్’పై మొదలైన వివాదం!

హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…

Saturday, 14 March 2026, 5:49 PM

‘కాక్‌టెయిల్ 2’ రిలీజ్ డేట్ ఖరారు.. రష్మిక-షాహిద్-కృతి ఫస్ట్ లుక్ చూశారా?

ర‌ష్మిక మంద‌న్న‌, షాహిద్ కపూర్‌, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…

Saturday, 14 March 2026, 11:53 AM