టెక్నాల‌జీ

ఆన్‌లైన్ క్లాసుల‌కు హాజ‌ర‌య్యే విద్యార్థుల కోసం మంచి ఫీచ‌ర్లు క‌లిగిన, త‌క్కువ ధ‌ర ఉన్న ఉత్త‌మ‌మైన స్మార్ట్ ఫోన్లు..!

క‌రోనా నేప‌థ్యంలో గతేడాది ఏప్రిల్ నుంచి విద్యార్థులు ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల‌కే ప‌రిమితం అయ్యారు. కోవిడ్ రెండో ప్ర‌భావం త‌గ్గుముఖం ప‌డుతున్నా క్లాసులు ఎప్పుడు మొద‌ల‌వుతాయో తెలియ‌ని అయోమ‌య ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో ఆన్‌లైన్ క్లాసుల‌తోనే నెట్టుకొస్తున్నారు. అయితే ఇంట్లో ఉండి ఆన్‌లైన్ క్లాసులకు హాజ‌ర‌య్యే విద్యార్థుల‌కు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు లేదా కంప్యూట‌ర్లు కావ‌ల్సి వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే బ‌డ్జెట్ ధ‌ర‌లో అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి విద్యార్థుల‌కు ఆన్‌లైన్ క్లాసుల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ధ‌ర కూడా త‌క్కువే. మ‌రి ఆ ఫోన్లు ఏమిటంటే..

1. శాంసంగ్ కు చెందిన గెలాక్సీ ఎఫ్‌12 స్మార్ట్ ఫోన్ ధ‌ర రూ.10,999గా ఉంది. ఇందులో 6.5 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్, 4జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 48, 5, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ వంటి అద్భుత‌మైన ఫీచ‌ర్లు ఉన్నాయి. ఇది ఆన్‌లైన్ క్లాసుల‌కు ప‌ర్ ఫెక్ట్ గా సూట‌వుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

2. రియ‌ల్‌మికి చెందిన నార్జో 30ఎ ఫోన్ ధ‌ర రూ.8,249గా ఉంది. ఇందులో 6.5 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 13, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఫీచ‌ర్లు ఉన్నాయి.

3. శాంసంగ్‌కు చెందిన గెలాక్సీ ఎం12 ఫోన్ ధ‌ర రూ.10,999గా ఉంది. ఇందులో 6.5 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, 8 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి.

4. రెడ్‌మీ 9ఎ స్మార్ట్ ఫోన్ ధ‌ర రూ.7,499గా ఉంది. ఇందులో 6.53 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 2/3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 13, 5 మెగాపిక్స‌ల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ త‌దిత‌ర ఫీచ‌ర్లు ఉన్నాయి.

5. రెడ్‌మీ 9 ప్రైమ్ స్మార్ట్ ఫోన్ ధ‌ర రూ.9,499గా ఉంది. ఇందులో 6.53 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్, 4జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్‌, 13, 8, 2, 5 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, 5020 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఫీచ‌ర్లు ఉన్నాయి.

ఇవే కాకుండా రియ‌ల్‌మికి చెందిన సి25 (ధ‌ర రూ.9,499), పోకో సి3 (రూ.9,999), ఒప్పో ఎ15 (రూ.9,990), రెడ్‌మీ 9 (రూ.8,999), రియ‌ల్‌మి సి20 (రూ.6,799) ఫోన్లు కూడా విద్యార్థుల‌కు ఆన్‌లైన్ క్లాసుల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. పైగా త‌క్కువ ధ‌ర‌ల‌కే అందుబాటులో ఉన్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో…

Wednesday, 18 March 2026, 8:13 PM

బాక్సాఫీస్ వద్ద రణవీర్ సునామీ.. విడుదలకు ముందే ‘ధురంధర్ 2’ రూ.153 కోట్ల వసూళ్లు!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ధురంధ‌ర్ 2 చిత్రం విడుద‌ల‌కు ముందే బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తోంది. ఈ…

Wednesday, 18 March 2026, 5:54 PM

విడాకుల తర్వాత గోల్డెన్ టెంపుల్‌లో హన్సిక.. వైరల్ అవుతున్న ‘కీలక’ పోస్ట్!

వ్యాపార వేత్త సోహైల్ ఖ‌తురియాతో విడాకులు తీసుకున్న అనంత‌రం హ‌న్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్‌ను సంద‌ర్శించి ఇన్‌స్టాగ్రామ్‌లో కీల‌క పోస్టు…

Wednesday, 18 March 2026, 12:31 PM

గ్యాస్ కొరత భయం.. అక్షయ్ కుమార్ భార్య ముందస్తు ప్లాన్! ఎలక్ట్రిక్ స్టవ్స్ ఆర్డర్..

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…

Tuesday, 17 March 2026, 8:32 PM