టెక్నాల‌జీ

అమెజాన్ గ్రేట్ ఫ్రీడ‌మ్ ఫెస్టివ‌ల్ సేల్.. ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌ల‌పై త‌గ్గింపు ధ‌ర‌లు..

ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్బంగా గ్రేట్ ఫ్రీడ‌మ్ ఫెస్టివ‌ల్ సేల్‌ను నిర్వ‌హిస్తోంది. ఈ సేల్ గురువారం ప్రారంభం కాగా ఆగ‌స్టు 9వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీల‌పై భారీ డిస్కౌంట్ల‌ను అందిస్తున్నారు.

ఈ సేల్‌లో మొబైల్స్ పై 40 శాతం వ‌ర‌కు, హెడ్ ఫోన్స్ పై 70 శాతం వ‌ర‌కు, స్మార్ట్ వాచ్‌ల‌పై 60 శాతం వ‌ర‌కు, ట్యాబ్‌ల‌పై 45 శాతం వ‌ర‌కు త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు.

స్మార్ట్ ఫోన్ల‌పై అందుబాటులో ఉన్న డీల్స్ వివ‌రాలు

  • యాపిల్ ఐఫోన్ 12 ప్రొ 128 జీబీ – రూ.1,08,900 (రూ.11వేలు త‌గ్గింపు)
  • యాపిల్ ఐఫోన్ 11 64జీబీ – రూ.48,999 (రూ.6901 త‌గ్గింపు)
  • వన్‌ప్ల‌స్ 9 5జి 6జీబీ + 128 జీబీ – రూ.45,999 (రూ.4వేలు తగ్గింపు)
  • వ‌న్‌ప్ల‌స్ 9ఆర్ 5జి – రూ.37,999 (రూ.2000 త‌గ్గింపు)
  • ఎంఐ 11ఎక్స్ 5జి 6జీబీ + 128 జీబీ – రూ.27,999 (రూ.2000 త‌గ్గింపు)
  • శాంసంగ్ గెలాక్సీ ఎం42 5జి 6జీబీ + 128 జీబీ – రూ.20,999 (రూ.1000 త‌గ్గింపు)
  • రెడ్‌మీ నోట్ 10 ప్రొ మ్యాక్స్‌ 6జీబీ + 128 జీబీ – రూ.18,999 (రూ.1000 త‌గ్గింపు)
  • ఐక్యూ జ‌డ్‌3 5జి 6జీబీ + 128 జీబీ – రూ.18,490 (రూ.1500 త‌గ్గింపు)
  • ఒప్పో ఎఫ్17 6జీబీ + 128 జీబీ – రూ.14,990 (రూ.2000 త‌గ్గింపు)
  • టెక్నో స్పార్క్ 7టి 4జీబీ + 64 జీబీ – రూ.8,599 (రూ.400 త‌గ్గింపు)
  • రెడ్‌మీ 9ఎ – రూ.6,799 (రూ.500 త‌గ్గింపు)
  • రియ‌ల్‌మి సి11 (2021) – రూ.6,699 (రూ.300 త‌గ్గింపు)

ఇక ఈ సేల్‌లో యాపిల్‌కు చెందిన ఐప్యాడ్ ఎయిర్ 2020 రూ.47,900 ప్రారంభ ధ‌ర‌కు ల‌భిస్తోంది. ల్యాప్‌టాప్‌లు రూ.30వేల ప్రారంభ ధ‌ర‌కు లభిస్తున్నాయి. టీవీల‌పై 55 శాతం, స్మార్ట్ ఫోన్ కేసెస్‌పై 70 శాతం, ఇంట‌ర్న‌ల్ ఎస్ఎస్‌డీలు, మెమోరీల‌పై 40 శాతం, కెనాన్ కెమెరాల‌పై 24 శాతం వ‌ర‌కు త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు. అమెజాన్‌కు చెందిన Echo Dot (4th Gen, 2020) ధ‌ర రూ.1050 తగ్గి రూ. 3,449 ధ‌ర‌కు ల‌భిస్తుండ‌గా, Fire TV Stick (3rd Gen, 2021) ధ‌ర రూ.1200 త‌గ్గిం రూ.2,799 కు ల‌భిస్తోంది. అలాగే Echo Dot (3rd Gen) రూ.1050 త‌గ్గి రూ.2,449 ధ‌ర‌కు, Fire TV Stick Lite (2020) రూ.700 త‌గ్గి రూ.2,299 ధ‌ర‌కు ల‌భిస్తున్నాయి.

ఇక బోట్ బ్లూటూత్ స్పీక‌ర్లు, సౌండ్ బార్‌ల‌పై 75 శాతం వ‌ర‌కు రాయితీని అందిస్తున్నారు. సోనీ హెడ్ ఫోన్స్ ను 47 శాతం డిస్కౌంట్‌తో రూ.1024 ప్రారంభ ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. వైర్డ్ ఇయ‌ర్ ఫోన్స్ పై 87 శాతం వ‌ర‌కు త‌గ్గింపు ధ‌ర‌ను అందిస్తున్నారు.

హాన‌ర్ మ్యాజిక్ వాచ్ 2 ను రూ.6వేలు త‌గ్గింపుతో రూ.9,999 ధ‌ర‌కు, అమేజ్‌ఫిట్ టి-రెక్స్ ను రూ.3500 త‌గ్గింపు తో రూ.6499 ధ‌ర‌కు, అమేజ్‌ఫిట్ జీటీఎస్‌2 మినీ ని రూ.500 త‌గ్గింపుతో రూ.6499కు, అమేజ్ ఫిట్ బిప్ యు ప్రొ ను రూ.300 త‌గ్గింపుతో రూ.4699కు, వ‌న్‌ప్ల‌స్ స్మార్ట్ బ్యాండ్‌ను రూ.300 త‌గ్గింపుతో రూ.2199 ధ‌ర‌కు ఈ సేల్‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఈ సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల‌తో వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM