Virat Kohli : భారత క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లికి గడ్డుకాలం నడుస్తుందని చెప్పవచ్చు. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో తొలి రౌండ్‌లోనే భారత జట్టు వెనుదిరిగి రావడం పట్ల తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు. ఇక ఎన్నో ఏళ్ల నుంచి ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును సెమీ ఫైనల్ వరకు తీసుకెళ్తున్నా.. ట్రోఫీని ఎత్తలేకపోయాడు. ఈ క్రమంలోనే అటు టీ20లతోపాటు ఇటు ఆర్‌సీబీ జట్టుకు కెప్టెన్‌గా వైదొలగుతున్నట్లు కోహ్లి ఇటీవలే తెలిపాడు. అయితే కథ అంతటితో ముగియలేదు.
టీ20లకు కోహ్లి కెప్టెన్‌గా గుడ్‌బై చెప్పి కేవలం బ్యాట్స్‌మన్ గానే కొనసాగుతున్నాడు. వన్డేలు, టెస్టులకు కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే బీసీసీఐ తాజాగా అతనికి షాకిచ్చింది. వన్డేలకు కూడా కెప్టెన్ గా కోహ్లిని తప్పించి రోహిత్ శర్మకు ఆ బాధ్యతలను అప్పగించారు. దీంతో కోహ్లి వన్డే కెప్టెన్సీ కూడా పోయింది. కేవలం టెస్టులకు మాత్రమే ఇకపై అతను కెప్టెన్‌గా ఉంటాడు.
వాస్తవానికి 2023 వరల్డ్ కప్ వరకు కోహ్లి వన్డేలకు కెప్టెన్‌గా ఉందామనుకున్నాడు. కానీ బీసీసీఐ అతని ఆశలను అడియాశలు చేసింది. దీంతో కోహ్లి మనస్థాపం చెందినట్లు సమాచారం. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సహజంగానే ఏ దేశమైనా ఒకే కెప్టెన్‌ను నియమిస్తుంది. టెస్టులకు వేరే కెప్టెన్ ఉంటారు. కానీ టీ20లకు ఒకరు, వన్డేలకు ఒకరు కెప్టెన్‌గా ఏ దేశ జట్టుకు లేరు. ఇదే విషయాన్ని బీసీసీఐ చెబుతూ కోహ్లిని వన్డేలకు కెప్టెన్ గా తప్పించింది. దీంతో భారత టీ20, వన్డే జట్లకు ఇకపై రోహిత్ శర్మనే కెప్టెన్‌గా కొనసాగనున్నాడు.
అయితే ఈ విషయాన్ని బీసీసీఐ కోహ్లికి ముందుగానే చెప్పినా.. ఇలా సడెన్‌గా తనను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం పట్ల కోహ్లి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ రానున్న రోజుల్లో టీ20లు, వన్డేల్లో అతను బ్యాట్స్‌మన్‌గా కూడా విఫలం అయితే అప్పుడు ఇక జట్టులో కూడా చోటు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక అంత వరకు రావడం ఎందుకని భావిస్తూ.. ఆ రెండు ఫార్మాట్లకు త్వరలోనే కోహ్లి రిటైర్మెంట్ ప్రకటిస్తాడని తెలుస్తోంది.
బీసీసీఐ తనను సడెన్ గా వన్డే కెప్టెన్ గా తీసేయడం పట్ల మనస్థాపం చెందిన కోహ్లి త్వరలో వన్డేలు, టీ20లకు గుడ్ బై చెప్పబోతున్నట్లు సమాచారం. దీంతో కేవలం టెస్టులలో మాత్రమే కొనసాగాలని కోహ్లి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…