Simbu : తమిళ హీరో శింబు అస్వస్థతకు గురయ్యాడు. శింబుకు తీవ్ర ఇన్ఫెక్షన్ సోకడంతో ఆయనను హాస్పిటల్‌లో చేర్పించారు. ఆయన గత రెండు రోజుల నుంచి తీవ్రమైన జ్వరం, గొంతులో ఇన్‌ఫెక్షన్ తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన హాస్పిటల్‌లో చేరారు. అయితే ఈ లక్షణాలు కోవిడ్‌కు చెందినవిగా అనిపిస్తున్నాయి. దీంతో ఆయనకు కోవిడ్ సోకిందేమోనని అనుమానిస్తున్నారు. కోవిడ్ కాకపోతే సాధారణ ఫ్లూ జ్వరం అయి ఉండే అవకాశం ఉంటుంది. ఏ విషయమూ వైద్య పరీక్షల అనంతరం తేలనుంది.
శింబు హాస్పిటల్‌లో చేరాడన్న సమాచారం తెలియగానే ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. శింబు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇక శింబు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెందు తనిందదు కాడు అనే మూవీలో నటిస్తున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో విన్నై తాండి అనే మూవీ వచ్చింది. తెలుగులో దీన్ని నాగచైతన్య ఏ మాయ చేశావె పేరిట రీమేక్ చేసి హిట్ కొట్టాడు.
శింబు తెలుగులో మన్మథ, వల్లభ వంటి హిట్ చిత్రాలను విడుదల చేసి మంచి సక్సెస్ సాధించాడు. తరువాత పలు సినిమాలు చేసినా అవి అంతగా ఆకట్టుకోలేదు. దీంతో కొన్నేళ్ల పాటు శింబు కనిపించకుండా పోయాడు. అయితే ఇటీవలే తన కొత్త మూవీ ప్రెస్ మీట్ లో భావోద్వేగానికి గురయ్యాడు. తను ఇకపై అభిమానులకు దగ్గరగా ఉంటానని తెలిపాడు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…