క్రికెట్

రెండో పెళ్లి చేసుకున్న శిఖర్ ధావన్.. సోఫీ షైన్‌తో కొత్త జీవితం ప్రారంభం!

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన శిఖర్ ధావన్ – సోఫీ షైన్ జంట. Photo Credit: Yuzvendra Chahal/Instagram.

భార‌త మాజీ క్రికెట‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ త‌న గర్ల్ ఫ్రెండ్ సోఫీ షైన్‌ను వివాహం చేసుకున్నాడు. శ‌నివారం (ఫిబ్ర‌వ‌రి 21, 2026) జ‌రిగిన ఓ ప్రైవేటు వివాహ కార్య‌క్ర‌మంలో వీరిద్ద‌రూ ఒక్క‌ట‌య్యారు. వీరు గ‌తేడాది నుంచి రిలేష‌న్‌షిప్‌లో ఉండ‌గా ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. గ‌తేడాది మే నెల‌లో ధావ‌న్ త‌మ రిలేష‌న్‌షిప్ గురించి ప‌బ్లిగ్గా వెల్ల‌డించాడు. ఈ ఏడాది జ‌న‌వ‌రి 12న నిశ్చితార్థం జ‌రుపుకున్న ఈ జంట తాము పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే తాజాగా వీరి వివాహం జ‌రిగింది. ధావ‌న్‌, సోఫీ జంట మొద‌ట 2025లో దుబాయ్‌లో జరిగిన చాంపియ‌న్స్ ట్రోఫీ సంద‌ర్భంగా క‌నిపించ‌గా, ఆ త‌రువాత జ‌రిగిన ఓ మీడియా కాన్‌క్లేవ్‌లోనూ వీరు ద‌ర్శ‌న‌మిచ్చారు. దీంతో ధావ‌న్ అప్ప‌ట్లోనే తాను ప్రేమ‌లో ప‌డిన‌ట్లు హింట్ ఇచ్చాడు. అయితే ఈ ఇద్ద‌రి పెళ్లికి సంబంధించిన ఫొటోల‌ను స‌హ‌చ‌ర క్రికెట‌ర్ యజ్‌వేంద్ర చాహ‌ల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఆ పోస్టుకు చాహ‌ల్‌.. మేరే యార్ కీ షాదీ హై.. అని కామెంట్ కూడా పెట్టాడు. దీంతో ఈ వార్త వైర‌ల్ అవుతోంది.

సోఫీ ఎవ‌రంటే..?

పెళ్లి ఫొటోల్లో శిఖ‌ర్ ధావ‌న్ క్రీమ్ క‌ల‌ర్ షెర్వానీ ధ‌రించ‌గా దానిపై పువ్వుల డిజైన్ ఉంది. త‌న భాగ‌స్వామి సోఫీ లెహెంగా ధ‌రించింది. దానిపై కూడా పువ్వుల థీమ్ ఉండ‌డం విశేషం. శిఖ‌ర్ ధావ‌న్‌, సోఫీ జంట ఫిబ్ర‌వ‌రి 20, 2026న హ‌ల్దీ వేడ‌క‌ను జ‌రుపుకోగా సోఫీ ఆ ఫొటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. సోఫీ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ప్ర‌కారం ఆమె ఐర్లాండ్ వాసిగా తెలుస్తోంది. ఆమె అమెరికాకు చెందిన నార్త‌ర్న్ ట్ర‌స్ట్ కార్పొరేష‌న్ అనే ఫైనాన్స్ సంస్థ‌లో సెకండ్ వైస్ ప్రెసిడెంట్ – ప్రొడ‌క్ట్ క‌న్స‌ల్టెంట్‌గా ప‌నిచేస్తున్న‌ట్లు ఉంది. సోఫీని ధావ‌న్ యూఏఈలోనే క‌లిసిన‌ట్లు స‌మాచారం. ఆ త‌రువాతే వీరి మ‌ధ్య స్నేహం మొద‌లై అది ప్రేమ‌గా మారి చివ‌ర‌కు పెళ్లి వ‌ర‌కు వ‌చ్చింద‌ని తెలుస్తోంది. సోఫీ ఐర్లాండ్‌లోని క్యాజిల్‌రాయ్ కాలేజ్‌లో విద్యాభ్యాసం పూర్తి చేయ‌డంతోపాటు లైమెరిక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో మార్కెటింగ్ అండ్ మేనేజ్‌మెంట్ విభాగంలో విద్యాభ్యాసం పూర్తి చేసింది.

మొద‌టి భార్య‌తో విడాకులు..

సోఫీతో ధావ‌న్‌కు ఇది రెండో వివాహం కాగా అంత‌కు ముందు ధావ‌న్ ఆయేషా ముఖ‌ర్జీతో అక్టోబ‌ర్ 2023లో విడాకులు తీసుకున్నాడు. త‌మ 11 ఏళ్ల వివాహ బంధానికి స్వ‌స్తి ప‌లుకుతూ ధావ‌న్‌, ఆయేషా దంప‌తులు అప్ప‌ట్లో విడిపోయారు. ఆమెను ధావ‌న్ 2011లో వివాహం చేసుకున్నాడు. అయితే అప్ప‌టికే ఆయేషాకు త‌న మొద‌టి వివాహం కార‌ణంగా ఇద్ద‌రు కూతుళ్లు క‌లిగారు. ఇక ఆయేషా, ధావ‌న్‌లు క‌ల‌సి ఉండ‌లేమ‌ని నిర్దారించుకుని విడాకుల‌కు అప్లై చేయ‌గా, ఢిల్లీ కోర్టు వీరికి విడాకుల‌ను మంజూరు చేసింది. ఆ త‌రువాత త‌న కుమారుడు జోరావార్‌ను అనేక ఏళ్ల పాటు క‌ల‌వ‌నీయ‌కుండా ఆయేషా దూరంగా ఉంచింద‌ని, దీంతో తాను తీవ్ర మనోవేద‌న‌కు గుర‌య్యాన‌ని ధావ‌న్ కోర్టుకు వివరించాడు. ఈ క్ర‌మంలో కోర్టు ధావ‌న్‌కి శాశ్వ‌త క‌స్ట‌డీ ఇవ్వ‌క‌పోయినా కుమారున్ని క‌లిసేందుకు, అత‌నితో వీడియో కాల్ మాట్లాడేందుకు అనుమ‌తిచ్చింది. అయితే ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్న ఆయేషా త‌న కుమారుడితో త‌న‌ను మాట్లాడనివ్వ‌డం లేద‌ని, కాల్స్ ను పూర్తిగా బ్లాక్ చేసింద‌ని ధావ‌న్‌ ప‌లు మార్లు తెలిపాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM

అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ ట్రైలర్ వచ్చేసింది.. 14 ఏళ్ల తర్వాత ప్రియదర్శన్‌తో మ్యాజిక్!

ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియ‌ద‌ర్శ‌న్ తెరకెక్కించిన అక్ష‌య్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…

Monday, 6 April 2026, 5:35 PM

ట్రోల్స్‌ను పట్టించుకుంటే ముందుకు సాగలేం.. విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

సోష‌ల్ మీడియాలో వ‌చ్చే ట్రోల్స్‌ను తాము ప‌ట్టించుకోమ‌ని, ఈమ‌ధ్య సెల‌బ్రిటీల‌ను ట్రోల్ చేయ‌డం ఎక్కువైంద‌ని, ఆ ట్రోల్స్‌ను ప‌ట్టించుకుంటే ముందుకు…

Monday, 6 April 2026, 12:49 PM

రివ్యూలు చూసి సినిమాలు మానేయకండి.. ‘బైకర్’ సక్సెస్ మీట్‌లో జీవిత రాజశేఖర్ ఆవేదన!

సినిమాలు ఎంత బాగున్న‌ప్ప‌టికీ కొంద‌రు రివ్యూయ‌ర్లు ఇచ్చే రివ్యూల కార‌ణంగా నెగెటివ్ టాక్ వ‌స్తుంద‌ని, దీంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం…

Sunday, 5 April 2026, 6:16 PM

ప్రభాస్ ‘ఫౌజీ’ లీకులకు చెక్.. ఫ్యాన్స్‌కు మేకర్స్ సీరియస్ వార్నింగ్! చట్టపరమైన చర్యలు తప్పవు..

ఇటీవ‌లి కాలంలో చాలా వ‌ర‌కు సినిమాలకు గాను షూటింగ్ స్పాట్ నుంచే హీరోలు లేదా ఇత‌ర న‌టీన‌టుల‌కు చెందిన ఫొటోలు,…

Sunday, 5 April 2026, 3:18 PM

గ్యారంటీలపై రేవంత్‌కు బండి సంజయ్ ఓపెన్ ఛాలెంజ్.. నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం!

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన 6 హామీల‌ను అస‌లు అమ‌లు చేయ‌లేద‌ని, రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా స‌రే…

Saturday, 4 April 2026, 11:25 PM