శ్రీలంక టూర్‌లో భాగంగా ఆ జట్టుతో కొలంబోలో ఆదివారం జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ సునాయాసంగానే ఛేదించింది. శ్రీలంకపై భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో 3 వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాట్స్‌మన్‌లలో చమిక కరుణరత్నె (43 పరుగులు), దసున్ శనక (39), చరిత్ అసలంక (38)లు ఫర్వాలేదనిపించారు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేదు. భారత బౌలర్లలో దీపక్ చాహర్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లకు తలా 2 వికెట్లు దక్కాయి. హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలు చెరొక వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన భారత్ కేవలం 36.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన భారత బ్యాట్స్‌మెన్ పరుగులను పిండుకున్నారు. దీంతో 36.4 ఓవర్లలో 3 వికెట్లను కోల్పోయిన భారత్ 263 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. భారత బ్యాట్స్‌మెన్‌లలో కెప్టెన్ శిఖర్ ధావన్ 86 పరుగుల నాటౌట్ స్కోరుతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అలాగే ఇషాన్ కిషన్ (59), పృథ్వీ షా (43)లు కూడా రాణించారు. శ్రీలంక బౌలర్లలో ధనంజయ డిసిల్వకు 2, లక్షన్ సందకన్‌కు 1 వికెట్ దక్కాయి. ఇక ఈ సిరీస్‌లో రెండో వన్డే ఈ నెల 20న ఇదే స్టేడియంలో జరగనుంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…