లండన్‌లోని ది ఓవల్ మైదానంలో భారత్ ఇంగ్లండ్‌పై చరిత్రాత్మక విజయం సాధించిన విషయం విదితమే. ఓవల్‌లో 50 ఏళ్ల తరువాత మళ్లీ ఇప్పుడే భారత్ ఇంగ్లండ్‌పై గెలిచింది. 157 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. దీంతో నాలుగో టెస్టులో భారత్ విజయం సాధించగా సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వచ్చింది.
అయితే ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్, బౌలర్లు సమిష్టిగా రాణించారు. అందువల్ల భారత్ విజయం సునాయాసమైంది. ఇక ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా పలు కీలక వికెట్లు తీశాడు. లంచ్ అనంతరం వేసిన స్పెల్‌లో ముందుగా ఓల్లి పోప్‌ను వెనక్కి పంపాడు. దీంతో టెస్టుల్లో అత్యంత వేగంగా 100 వికెట్లను తీసిన ఇండియన్ ఫాస్ట్ బౌలర్‌గా బుమ్రా రికార్డు సాధించాడు.
తరువాత మరో నాలుగు బంతులు వేసిన బుమ్రా ఇంకో కీలక వికెట్ తీశాడు. జానీ బెయిర్ స్టోను క్లీన్ బౌల్డ్ చేశాడు. అద్భుతమైన యార్కర్‌తో బెయిర్‌స్టోను బుమ్రా పెవిలియన్‌కు పంపాడు. బుమ్రా వేసిన బంతికి బెయిర్‌స్టో వద్ద సమాధానం లేదు. ఈ క్రమంలో బెయిర్‌స్టోకు ఈ ఏడాదిలో ఇది వరుసగా 4వ డక్ అయింది. కాగా బెయిర్‌స్టోను ఔట్ చేసేందుకు బుమ్రా వేసిన యార్కర్ తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బుమ్రాపై అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…