ఆఫ్‌బీట్

డాక్ట‌ర్లు ప్రిస్క్రిప్ష‌న్‌లో అర్థం కాకుండా ఎందుకు రాస్తారో తెలుసా ?

ఏదైనా అనారోగ్య స‌మ‌స్య వ‌చ్చి హాస్పిట‌ల్‌కు వెళితే ప‌రీక్ష‌లు చేశాక డాక్ట‌ర్లు మ‌న‌కు మందుల‌ను రాస్తుంటారు. అయితే డాక్ట‌ర్లు రాసే చిట్టీలో మందుల వివ‌రాల‌ను చూస్తే మ‌న‌కు అస్స‌లు అర్థం కావు. వారు రాసే అక్ష‌రాల‌ను అస్స‌లు అర్థం చేసుకోలేం. అయితే డాక్ట‌ర్లు ఇలా మ‌న‌కు అర్థం కాకుండా మందుల‌ను ఎందుకు ప్రిస్క్రిప్ష‌న్‌లో రాస్తారో తెలుసా ? ఆ వివ‌రాల‌నే ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌న దేశంలో సాధారణంగా వైద్యులు ఒక్కోసారి రోజుకు 100కు పైగా పేషెంట్ల‌ను చూడాల్సి వ‌స్తుంది. అమెరికా వంటి దేశాల్లో అయితే ఒక రోజుకు డాక్ట‌ర్లు 20-30 మంది వ‌ర‌కే చూస్తారు. కానీ ఇక్క‌డ అలా కాదు. వైద్యుల సంఖ్య త‌క్కువ‌. పేషెంట్లు ఎక్కువ‌. క‌నుక ఒక్కో డాక్ట‌ర్ చాలా మంది పేషెంట్ల‌ను చూడాల్సి వ‌స్తుంది. ఈ క్ర‌మంలో ఒక్కో పేషెంట్‌కు చెందిన వివ‌రాల‌ను తెలుసుకుంటూ చిట్టీపై వారి వివ‌రాల‌తోపాటు మందుల‌ను రాయాలంటే చేతులు ఇబ్బంది పెడ‌తాయి. క‌నుక వారు వేగంగా రాస్తారు. అలా రాసే క్ర‌మంలో వారి రాత అర్థం కాకుండా పోతుంది.

ఇక పేషెంట్ల‌కు చెందిన వివ‌రాల‌ను చ‌క్క‌గా అర్థం వ‌చ్చేలా రాయాలంటే అందుకు స‌మ‌యం ప‌డుతుంది. కానీ మిగిలిన పేషెంట్ల‌ను చూసేందుకు స‌మ‌యం ఉండ‌దు. క‌నుక డాక్ట‌ర్లు ఆ విధంగా రాయాల్సి వ‌స్తుంది. ఇది కూడా అందుకు ఒక కార‌ణ‌మే.

ఇక మెడిసిన్ చ‌దివే వారు స‌హ‌జంగానే ఎక్కువ‌గా రాయాల్సి ఉంటుంది. ఇత‌ర కోర్సుల్లో చ‌దివే వారి క‌న్నా మెడిసిన్ చ‌దివే వారు ఎక్కువ‌గా రాస్తారు. క‌నుక వారి రాత రాను రాను మారుతుంది. వారు వేగంగా రాయ‌డం అల‌వాటు చేసుకుంటారు. దీంతో ఆ రాత అర్థం కాకుండా పోతుంది. మ‌నం ప‌రీక్ష హాల్‌లో ముందుగా చ‌క్క‌గానే రాస్తాం. కానీ చివ‌ర‌కు వ‌చ్చే స‌రికి చేతులు నొప్పి వ‌స్తాయి. దీంతో చివ‌ర్లో మ‌నం స‌మాధానాల‌ను వేగంగా రాస్తాం. అప్పుడు మ‌న రాత కూడా మారుతుంది. స‌రిగ్గా ఉండ‌దు. డాక్ట‌ర్ల విష‌యంలోనూ అలాగే జ‌రుగుతుంది. అందుక‌నే వారి రాత అర్థం కాకుండా ఉంటుంది.

అయితే ప్ర‌స్తుతం చాలా మంది డాక్ట‌ర్లు కంప్యూట‌ర్ల స‌హాయంతో డిజిట‌ల్ ప్రిస్క్రిప్ష‌న్ ల‌ను ఇస్తున్నారు. అందువ‌ల్ల ఇప్పుడు చాలా వ‌ర‌కు డాక్ట‌ర్లు ఇచ్చే ప్రిస్క్రిప్ష‌న్ లు మ‌న‌కు అర్థం అవుతున్నాయి. వారి రాత బాగా లేనందుకు మ‌నం జోకులు కూడా వేసుకుంటాం. కానీ వారు ప‌డే బాధ మ‌న‌కు తెలియ‌దు. క‌నుక వారి రాత‌పై హేళ‌న చేయాల్సిన అవ‌స‌రం లేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

గ్యాస్ కొరత భయం.. అక్షయ్ కుమార్ భార్య ముందస్తు ప్లాన్! ఎలక్ట్రిక్ స్టవ్స్ ఆర్డర్..

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…

Tuesday, 17 March 2026, 8:32 PM

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM