ఆఫ్‌బీట్

Intelligent : మీరు తెలివైన వారు అవునో కాదో ఈ 10 అంశాలు చెప్పేస్తాయి..!

Intelligent : ఫ‌లానా వ‌స్తువు లేదా జీవి అంత బ‌రువు ఉంటుంద‌ని, ఫ‌లానా వ్య‌క్తి అంత పొడ‌వు ఉంటాడ‌ని, ఫ‌లానా ప్ర‌దేశాల మ‌ధ్య దూరం అంత ఉంటుంద‌ని.. మ‌న‌కు ఆయా అంశాల పరంగా కొన్ని ప్ర‌మాణాలు ఉంటాయి. వాటితోనే మ‌నం లెక్కిస్తాం. బ‌రువును కేజీల్లో, పొడవును అడుగులు లేదా సెంటీమీట‌ర్ల‌లో, దూరాన్ని కిలోమీట‌ర్ల‌లో.. ఇలా ఆయా అంశానికి అనుగుణంగా మ‌నం కొల‌త‌లు చెబుతాం. మరి ఓ వ్య‌క్తికి తెలివి ఎంత ఉందో తెలుసుకోవ‌డం ఎలా..? తెలివికి కొల‌మానం ఏమిటి..? అంటే.. మ‌న‌కు గుర్తుకు వ‌చ్చేది ఒక్క‌టే..! అదే ఐక్యూ.. ఇంటెల్లిజెంట్ కోషంట్ (intelligence quotient).

ఐక్యూని లెక్కిస్తేనే ఏ వ్య‌క్తికైనా తెలివి ఎంత ఉంటుంది అనేది అవ‌గ‌త‌మ‌వుతుంది. ఐక్యూ ఎంత ఎక్కువ ఉంటే అంత తెలివైన వారుగా వారు గుర్తింప‌బ‌డ‌తారు. అయితే మీకు తెలుసా..? ఐక్యూ లెక్కించినా, లెక్కించ‌క‌పోయినా, కొంద‌రు వ్య‌క్తులు మాత్రం ఆయా అంశాల ప‌రంగా తెలివిమంతులేన‌ట‌..! అవును, మీరు వింటోంది క‌రెక్టే..! మ‌రి ఎలాంటి వారు తెలివిమంతులో ఇప్పుడు తెలుసుకుందామా..!

ఎక్కువ భాష‌లు వ‌స్తే..

ఒక‌టి క‌న్నా ఎక్కువ భాష‌ల్లో ప్ర‌వేశం ఉన్న వారు తెలివైన వార‌ట‌. క‌నీసం 2, 3 భాష‌ల్లోనైనా మాట్లాడ‌గ‌లిగి, అర్థం చేసుకోగ‌లిగి, రాయ‌గ‌లిగి ఉన్న‌వారు మిక్కిలి తెలివిమంతుల‌ట‌. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల ప‌రిశోధ‌న‌లు చేసిన సైంటిస్టులు తెలుసుకున్నారు. మ‌న మాజీ ప్రధాని పీవీ న‌ర‌సింహారావుకు ఏకంగా 16 భాష‌లు వ‌చ్చు క‌దా. దీన్ని బ‌ట్టి చూస్తే ఆయన ఎంత‌టి ప్ర‌జ్ఞాశాలో మ‌న‌కు ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

Intelligent

ఇంటికి పెద్ద‌వారు..

ఇంట్లో పెద్ద సంతానంగా పుట్టిన వారు తెలివిమంతుల‌ట‌. అన్న‌, అక్క.. ఇలాంటి వారు తెలివి గ‌ల‌వార‌ట‌. వారే ఇంటికి చెందిన మంచి చెడ్డ‌ల‌ను చూడ‌డంలో దిట్ట‌ల‌ట‌. దీన్ని ఇటీవ‌ల చేసిన ప‌రిశోధ‌న‌లు వెల్ల‌డించాయి కూడా.

డిగ్రీ చేసిన వారు..

టెన్త్‌, ఇంట‌ర్ చ‌దివిన వారితో పోలిస్తే డిగ్రీ చ‌దివిన వారిలో చాలా మంది తెలివిమంతులు ఉంటార‌ట‌. వారిలో దాదాపుగా 35 శాతం మంది తెలివిగ‌ల వారేన‌ట‌.

ఎడ‌మ చేతి వాటం..

కుడిచేతి వాటం క‌న్నా ఎడ‌మ చేతి వాటం ఉన్న‌వారే ఎక్కువ తెలివిమంతుల‌ట‌. వారికే తెలివి ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌.

తెలియ‌ద‌ని చెప్పే స్వ‌భావం..

కొంద‌రు త‌మ‌కు ఏమీ తెలియ‌క పోయినా అంతా తెలుస‌ని భావిస్తారు. అయితే అలాంటి వారి క‌న్నా త‌మ‌కు అంతా తెలిసినా, ఏమీ తెలియ‌ద‌ని చెప్పే వారే తెలివిమంతుల‌ట‌.

దిగులు ప‌డేవారు..

దిగులు చెందుతూ ఉండే వారే అధిక శాతం వ‌ర‌కు తెలివిమంతులు అయి ఉంటార‌ట‌. ప‌లువురు ప‌రిశోధ‌కులు చేసిన ప‌రిశోధ‌న‌లు ఈ విష‌యాల‌ను వెల్లడిస్తున్నాయి.

పెంపుడు జంతువుల‌పై ఇష్టం..

కుక్క‌లు, పిల్లుల వంటి జంతువుల‌ను పెంచుకునే వారి ఐక్యూ లెవ‌ల్స్ ఎక్కువ‌గా ఉంటాయ‌ట‌. వారే తెలివిమంతులుగా ఉంటార‌ట‌.

బ‌ద్ద‌క‌స్తులు..

ఫ్లోరిడా గ‌ల్ఫ్ కోస్ట్ విశ్వవిద్యాల‌యానికి చెందిన కొంద‌రు ప‌రిశోధ‌కులు చేసిన ప‌రిశోధ‌న‌లో తేలిన నిజం ఏమిటంటే.. యాక్టివ్‌గా ఉండేవారి క‌న్నా బ‌ద్ద‌క‌స్తులే ఎక్కువ తెలివిమంతులై ఉంటార‌ట‌.

స‌రాదాగా ఉండేవారు..

ఇత‌రుల‌తో చ‌నువుగా, స‌ర‌దాగా ఉండే వారు కూడా తెలివిమంతులేన‌ట‌. వారిలో కూడా ఐక్యూ లెవ‌ల్స్ ఎక్కువ‌గానే ఉంటాయ‌ట‌.

మ‌ద్య‌పానం..

మ‌ద్యం సేవించే వారిలో అధిక శాతం మంది తెలివిమంతులే అయి ఉంటార‌ట‌. సైంటిస్టులు చేసిన ప‌రిశోధ‌న‌లు ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తున్నాయి. అలాంటి వారిలో ఐక్యూ కూడా ఎక్కువ‌గానే ఉంటుంద‌ట‌.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

గ్యాస్ కొరత భయం.. అక్షయ్ కుమార్ భార్య ముందస్తు ప్లాన్! ఎలక్ట్రిక్ స్టవ్స్ ఆర్డర్..

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…

Tuesday, 17 March 2026, 8:32 PM

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM