ముఖ్య‌మైన‌వి

Chanakya : ఇతరులను మనదారిలోకి తెచ్చుకోవాలంటే ఇలా చేయండి.. చాణక్యుడు చెప్పిన చిట్కాలు..

Chanakya : ఆచార్య చాణ‌క్యుడు చెప్పిన ఈ విష‌యాల‌ను పాటిస్తే ఎలాంటి వ్య‌క్తినైనా ఇట్టే మ‌న దారిలోకి తెచ్చుకోవ‌చ్చ‌ట‌..! ప్ర‌పంచంలో ఏ ఇద్ద‌రు మ‌నుషుల మ‌న‌స్త‌త్వాలు కూడా ఒకే రకంగా ఉండ‌వు. ఒక్కొక్క‌రు ఒక్కో విధ‌మైన ల‌క్ష‌ణాల‌ను, వ్య‌క్తిత్వాల‌ను క‌లిగి ఉంటారు. ఈ క్ర‌మంలో ఏ వ్య‌క్తినైనా మ‌న దారిలోకి తెచ్చుకోవాలంటే అది చాలా క‌ష్టంతో కూడుకున్న ప‌నే అవుతుంది. ఎందుకంటే ఒక‌రి గురించి పూర్తిగా తెలుసుకున్నా వారిని మ‌న దారిలోకి తేవాలంటే అందుకు చాలా శ్ర‌మించాల్సి ఉంటుంది. అయితే ఒక నిర్దిష్ట‌మైన వ్య‌క్తిత్వం ఉన్న వారిని మాత్రం ఇట్టే మ‌న దారికి తెచ్చుకోవ‌చ్చ‌ట‌. అందుకోసం ఆచార్య చాణ‌క్యుడు ప‌లు విష‌యాల‌ను తెలియ‌జేశాడు. అవేమిటంటే..

కోపంగా ఉండే మ‌న‌స్త‌త్వం ఉన్న వారి ఎదుట చాలా మ‌ర్యాదగా, ప్ర‌శాంతంగా ప్ర‌వ‌ర్తించాలి. ఎల్ల‌ప్పుడూ కోపాన్ని ప్ర‌ద‌ర్శించ‌కూడ‌దు. దీంతో వారు ఆటోమేటిక్‌గా కూల్ అయి కొంత శాంతి చెందుతారు. ఆ క్ర‌మంలో మ‌న దారికి వ‌స్తారు. మూర్ఖ‌పు స్వ‌భావం ఉన్న వారిని ఎల్ల‌ప్పుడూ పొగుడుతూ ఉండాల‌ట‌. వారినే ఎల్ల‌ప్పుడూ ఫాలో కావాల‌ట‌. దీంతో వారు ఆటోమేటిక్‌గా మ‌న కంట్రోల్‌లోకి వ‌చ్చేస్తార‌ట‌. ఒక వేళ మ‌న ఎదుట మ‌న‌క‌న్నా ప్ర‌తిభావంతులైన వ్య‌క్తులు ఉంటే వారితో ఎల్ల‌ప్పుడూ నిజాలే మాట్లాడాల‌ట‌. దీంతో వారు మ‌న ప‌ట్ల ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తూ మ‌న దారిలోకి వ‌స్తారు.

Chanakya

బాగా ఈగో మ‌న‌స్త‌త్వం ఉన్న వారిని మ‌న దారిలోకి తెచ్చుకోవాలంటే వారితో ఎల్ల‌ప్పుడూ మ‌ర్యాదగా ఉంటూ, అదేవిధంగా ప్ర‌వ‌ర్తించాలి. దీంతో వారు ఆటోమేటిక్‌గా మ‌న మాట వింటారు. స్వార్థం ఉన్న వారు, అత్యాశాప‌రుల‌ను సుల‌భంగా బుట్టలో ప‌డేయ‌వ‌చ్చు. వీరికి కొంత ధ‌నం ఆశ చూపితే చాలు, మ‌న దారిలోకి వ‌చ్చేస్తారు. చిన్న పిల్ల‌ల‌ను త‌ల్లిదండ్రులు ప్రేమ‌, ఆప్యాయ‌త‌ల‌తో లొంగ‌దీసుకోవ‌చ్చు. 5 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు వ‌ర‌కు వారిని అమిత‌మైన గారాబంగా, ప్రేమ‌తో పెంచాలి. అదే 10 ఏళ్ల లోపు వారైతే వారితో ఎలాంటి దురుసు ప్ర‌వ‌ర్త‌న చేయ‌కూడ‌దు. ఇక 16 ఏళ్ల లోపు వారు, ఆపైన వారితోనైతే త‌ల్లిదండ్రులు స్నేహితుల్లా మెల‌గాల్సి ఉంటుంది.

పైన చెప్పిన మ‌న‌స్త‌త్వాలు ఉన్న వ్య‌క్తుల‌తోనే కాదు, ఆయా సంద‌ర్భాల్లో ఎలా ప్ర‌వ‌ర్తించాలో కూడా చాణక్యుడు చెప్పాడు. ప్ర‌ధానంగా చాలా క్లిష్ట‌త‌ర‌మైన ప‌రిస్థితులు ఉన్న‌ప్పుడు వీలైనంత ఓర్పుతో ఉండాలట‌. అదే మంచి ఫ‌లితాల‌ను ఇస్తుంద‌ట‌. ఒక వ్య‌క్తికి ఉన్న‌టువంటి స‌హ‌జ‌సిద్ధ‌మైన అత‌ని స్వ‌భావాన్ని తెలుసుకోవాలంటే అత‌ని మాట‌లు, ప్ర‌వ‌ర్త‌న ఆధారంగా దాన్ని నిర్ణయించ‌వ‌చ్చ‌ట‌. ఇలా చాణ‌క్యుడు మ‌న జీవితానికి సంబంధించిన కొన్ని అద్భుత‌మైన చిట్కాల‌ను చెప్పాడు. వాటిని పాటిస్తే మ‌న జీవితం ఎంతో సుఖ‌మయం అవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

గ్యాస్ కొరత భయం.. అక్షయ్ కుమార్ భార్య ముందస్తు ప్లాన్! ఎలక్ట్రిక్ స్టవ్స్ ఆర్డర్..

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…

Tuesday, 17 March 2026, 8:32 PM

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM