బాబోయ్‌.. స‌మాధి నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్న మృత‌దేహం వెంట్రుక‌లు..

September 17, 2021 10:08 PM

శ్మ‌శానాలు అంటే స‌హ‌జంగానే చాలా మందికి భ‌యం క‌లుగుతుంది. అక్క‌డ ఎక్కువ సేపు ఉండ‌లేరు. అయితే స‌మాధులను సంద‌ర్శించేందుకు మాత్రం కొంద‌రు శ్మ‌శానాల‌కు వెళ్తుంటారు. త‌మ ఆత్మీయుల స‌మాధుల వ‌ద్ద పువ్వులు ఉంచి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించి కాసేపు ఉండి వ‌స్తుంటారు. ఇలా ఒక వ్య‌క్తి కూడా ఓ శ్మ‌శాన‌వాటిక‌కు వెళ్లాడు. కానీ అక్క‌డ క‌నిపించిన దృశ్యాల‌ను చూసి ఒక్క‌సారిగా భ‌య భ్రాంతుల‌కు గుర‌య్యాడు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

బాబోయ్‌.. స‌మాధి నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్న మృత‌దేహం వెంట్రుక‌లు..

కాలిఫోర్నియాలోని సాక్ర‌మెంటో అనే ప్రాంతంలో ఉన్న సెయింట్ జోసెఫ్ కాథ‌లిక్ శ్మ‌శాన‌వాటిక‌లో తన ఆత్మీయుల‌కు చెందిన స‌మాధుల‌ను చూసేందుకు 37 ఏళ్ల జోయెల్ మోరిస‌న్ అనే వ్య‌క్తి వెళ్లాడు. అయితే అక్క‌డ కొన్ని స‌మాధుల నుంచి మృత‌దేహాల‌కు చెందిన వెంట్రుక‌లు బ‌య‌ట‌కు వ‌చ్చి క‌నిపించాయి. దీంతో అత‌ను ఒక్క‌సారిగా షాక్‌కు గురై తీవ్రంగా భ‌య ప‌డ్డాడు. త‌రువాత తేరుకున్నాడు.

బాబోయ్‌.. స‌మాధి నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్న మృత‌దేహం వెంట్రుక‌లు..

అయితే ఈ విష‌యాన్ని అత‌ను అక్క‌డి నిర్వాహ‌కుల‌కు చెప్పాడు. దీంతో అలా ఎందుకు జ‌రుగుతుందో వారు ప‌రిశీలిస్తున్నారు. అక్క‌డ పురాత‌న వృక్షాలు కొన్ని ఉన్నాయ‌ని వాటి వేర్ల వ‌ల్ల స‌మాధులు దెబ్బ తింటున్నాయ‌ని, అలాగే క్రూర జంతువులు కూడా సంచ‌రిస్తున్నాయ‌ని అందుకే స‌మాధులు అలా అవుతున్నాయ‌ని భావిస్తున్నారు. కానీ క‌చ్చిత‌మైన ఆధారాలు ల‌భించ‌డం లేదు. ఏది ఏమైనా ఈ విషయం మాత్రం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now