Bad Dreams : కలలు కనడం మానవసహజం. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ కలలొస్తాయి. కలలు అనేవి మన ఆలోచనలకు ప్రతిరూపాలు. వచ్చిన కలల్ని బట్టి మన లైఫ్ లో కొన్ని ఫలితాలు ఉంటాయని మన పూర్వీకులు చెబుతుంటారు. మంచి కలలు మనకు సంతోషాన్నిస్తే చెడుగా వచ్చే కలలు మాత్రం ఒకింత ఆందోళనకు గురిచేస్తాయి. చెడు కలలకు అర్థం ఏమిటో తెలుసుకోండి.
చనిపోయిన వారు కలలో వస్తే అర్థం వారిని మీరు మర్చిపోలేకపోతున్నారని, వారి చావును జీర్ణించుకోలేకపోతున్నారని అర్ధం. మీకు మీరే చనిపోయినట్టు కలలో వస్తే మీలో పాజిటివ్ థింకింగ్ కి అది సంకేతం. మీరు నగ్నంగా ఉన్నట్టు కలలో వచ్చిందా మీ ఆత్మగౌరవం తగ్గుతుందనడానికి అది సూచన. అది మీలో అంతర్గత భయాన్ని సూచిస్తుంది. పాములు కలలో వస్తున్నాయా.. పాములను నిజంగా చూడడానికి కలలో చూడడానికి చాలా తేడా ఉంటుంది. నెగటివ్ ఆలోచనలు వస్తున్నాయనడానికి అది సంకేతం.
మన భాగస్వామి మనల్ని వదిలేసినట్టుగా లేదా మనకు దూరంగా పోయినట్టుగా కలలొస్తే మన రిలేషన్ షిప్ బాగాలేదని అర్థం. అలాగే వాళ్లతో హ్యాపీ గా లేమని అర్థం చేసుకోవాలి. వాళ్లని వేరొకరికి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అర్థం. ఎగ్జామ్ మిస్ అయినట్టు, ఎగ్జామ్ ఫెయిలైనట్టు కలలొస్తే అది మన ఒత్తిడిని సూచిస్తుంది. ఇంట్లో వాళ్లు మనపై పెట్టుకున్న అంచనాలను చేరుకోలేకపోతున్నట్లు ఆందోళన పడుతున్నామని దానికి అర్థం. మీకు యాక్సిడెంట్ అయినట్టు, గాయపడినట్టు కలలొస్తే మీరు ఆత్మగౌరవం పెంచుకోవాలని సూచిస్తాయి. మీ లైఫ్ బలహీనంగా ఉందని లైఫ్ లో ప్రాబ్లమ్స్ ని సమర్థవంతంగా ఎదుర్కోవాలని తెలుపుతాయి. చెడు కలలు వచ్చేవారు సృజనాత్మకత కలిగి ఉంటారని అధ్యయనాలు నిరూపించాయి. అయితే చెడు కలలు వస్తే చెడు జరగబోతుందనడానికి అర్థం కాదు. కానీ జాగ్రత్తగా ఉండాలని అర్థం.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…