పులస చేపల గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఏపీలో గోదావరి జిల్లాల్లో పులస బాగా లభిస్తుంది. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అందుకనే దీన్ని ఎంత ఖరీదుకు అయినా కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తిని చూపిస్తుంటారు. పుస్తెలు అమ్మి అయినా సరే పులస తినాలి అనే సామెత అందుకనే వచ్చింది.
పులస అత్యంత ఖరీదైన చేపగా ఉంది. వర్షాకాలం ప్రారంభంలో గోదావరిలో పులస చేపలు ఎక్కువగా లభిస్తాయి. అందుకనే వీటికి అంతటి ధర ఉంటుంది. ఇక ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో ఈ చేపలు కేజీకి రూ.5వేల నుంచి రూ.17వేల వరకు ధర పలుకుతున్నాయి. పులస వెరైటీని బట్టి ఆ ధర పలుకుతోంది. ఈ సీజన్‌లో ఆయా ప్రాంతాల్లో ఎక్కడ చూసినా మనకు పులస చేపలు బాగా కనిపిస్తాయి.
పులస చేపలను కొనుగోలు చేసేందుకు రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలు సైతం ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. కొందరు ఈ చేపలను ఇతరులకు బహుమతులుగా అందజేస్తుంటారు. కాగా మార్గెట్ వర్గాలు చెబుతున్న ప్రకారం.. ప్రతి రోజూ సుమారుగా 50కిలోల వరకు పులస చేపలు మార్కెట్‌కు వస్తుంటాయి. వాటిల్లో సుమారుగా 40కేజీల పులస చేపలను రోజూ అమ్ముతారు.
పులస చేపల కోసం తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా అనేక మంది వస్తుంటారు. జూలై నుంచి సెప్టెంబర్ వరకు గోదావరి నదిలో పులస చేపలు లభిస్తాయి. ఈ చేపలతో పులుసు పెట్టి తింటే అదిరిపోయే రుచి వస్తుంది. అయితే చేపలను పులుసుగా వండాక ఒక రోజు ఆగి తింటే ఇంకా చక్కని రుచి వస్తుందని చెబుతారు.
పులస చేపలను ఈ సీజన్ లో చాలా మంది తింటుంటారు. అనేక రెస్టారెంట్లలోనూ దీని వంటలను వడ్డిస్తుంటారు. పులస గోదావరి నదిలో ఎదురు ఈదుతుందని, అందుకనే దీనికి అంత రుచి ఉంటుందని చెబుతారు. ఇక కొన్ని చోట్ల అయితే మార్కెట్‌కు రాకుండానే నది వద్దే వీటిని అక్కడికక్కడే కొనుక్కెళ్తుంటారు. పులసా.. మజాకా.. మరి..!
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…