Nandi : ఆలయాలకు వెళ్లినప్పుడు గర్భ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి గంట మోగించి ఆ తరువాత భక్తులు దైవ దర్శనం చేసుకుంటారు. అయితే శివాలయానికి వెళ్లినప్పుడు మాత్రం ముందుగా నంది కొమ్ముల్లోంచే శివ లింగాన్ని చూస్తూ దర్శనం చేసుకోవాలి. ఇలా ఎందుకు దర్శనం చేసుకోవాలి ? దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
త్రిమూర్తులలో పరమేశ్వరుడు ఒకరు. ఆయనకు విగ్రహ రూపం ఉండదు. శివున్ని లింగం రూపంలో మనం దర్శించుకుంటాం. ఇక శివుడు లయ కారకుడు. ఆయన తన మూడో కన్ను తెరిస్తే సృష్టి అంతం అవుతుంది. కనుక అంతటి శక్తి ఉన్న శివున్ని నేరుగా దర్శించుకోకూడదు. దర్శించుకుంటే అరిష్టం కలుగుతుంది. కనుక ఆయనను ముందుగా ఆలయం ఎదురుగా ఉండే నంది కొమ్ముల్లోంచి చూస్తూ దర్శించుకోవాలి.
ఇక నంది కొమ్ముల్లోంచి చూస్తున్నప్పుడు కుడి చేత్తో నంది వీపును నిమరాలి. అదే సమయంలో నంది చెవిలో మన గోత్ర నామాలు, మన కోరికలు చెప్పాలి. ఇలా శివ లింగాన్ని దర్శించుకోవాలి. దీంతో కోరిక కోర్కెలు నెరవేరుతాయి. ఎంతో పుణ్య ఫలం లభిస్తుంది. అంతేకానీ శివ లింగాన్ని నేరుగా దర్శించుకోకూడదని.. అరిష్టం కలుగుతుందని.. పండితులు చెబుతున్నారు.
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…