ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు తన యూజర్లకు అద్భుతమైన ఫీచర్లను అందిస్తూ వస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే అనేక రకాల సదుపాయాలు అందులో అందుబాటులో ఉన్నాయి. ఇక త్వరలోనే మరో అద్భుతమైన ఫీచర్‌ను యూజర్లకు అందించనుంది. అయితే ఆ ఫీచర్ ఇప్పటికే ఉన్నా.. దానికి మరిన్ని మెరుగులు దిద్ది మళ్లీ కొత్తగా అందించేందుకు సిద్ధమవుతోంది.
వాట్సాప్‌లో మనం పంపుకునే మెసేజ్‌లను వెంటనే డిలీట్ చేసే సదుపాయం కూడా ఉన్న విషయం విదితమే. అయితే మొదట్లో మనం పంపుకునే మెసేజ్‌లను డిలీట్ చేసేందుకు 7 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చేవారు. తరువాత మెసేజ్‌లు డిలీట్ అయ్యేవి కావు. కానీ తరువాత అదే సమయాన్ని పెంచారు. పంపిన మెసేజ్ లను డిలీట్ చేసేందుకు తరువాత సమయాన్ని ఒక గంట 8 నిమిషాల 16 సెకన్లకు పెంచారు. అయితే ఇప్పుడు ఇదే సమయాన్ని మళ్లీ పెంచనున్నారు.
ఇకపై మనం వాట్సాప్ లో పంపే ఏ మెసేజ్‌ను అయినా సరే 2 రోజుల తరువాత కూడా ఎవరికీ కనిపించకుండా డిలీట్ చేయవచ్చు. వాట్సాప్ లో పంపే మెసేజ్ లను డిలీట్ చేసేందుకు సమయాన్ని ఏకంగా 2 రోజుల 12 గంటల వరకు పెంచారు. దీంతో యూజర్లకు మెసేజ్ లను డిలీట్ చేసేందుకు మరింత ఎక్కువ సమయం లభ్యం కానుంది. అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను బీటా యాప్‌లో టెస్ట్ చేస్తున్నారు. దీన్ని త్వరలోనే యూజర్లు అందరికీ పూర్తి స్థాయిలో అందించనున్నారు. ఇక ఇదే కాకుండా మరిన్ని ప్రైవసీ ఫీచర్లను కూడా వాట్సాప్ త్వరలోనే యూజర్లకు అందించనుంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…