గురువారం, జూన్ 11, 2026
ఆధ్యాత్మికం

Red Colour Clothes : ఎరుపు రంగు దుస్తుల‌ను వారంలో ఈ ఒక్క రోజు ధ‌రించండి.. స‌క‌ల సంప‌ద‌లు క‌లుగుతాయి..!

Red Colour Clothes : తెలుగు వారాలలో ఆదివారం చాలా గొప్పది. సాక్షాత్తూ సూర్యభగవానుడికి సంబంధించిన రోజు. సంస్కృతంలో భానువారంగా పిలువబడుతుంది. ఇంకా చెప్పాలంటే భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఆది వారాన్ని సూర్యదేవుని పేరుతో రవివార్ గా ఇప్పటికీ…

Red Colour Clothes : ఎరుపు రంగు దుస్తుల‌ను వారంలో ఈ ఒక్క రోజు ధ‌రించండి.. స‌క‌ల సంప‌ద‌లు క‌లుగుతాయి..!

Red Colour Clothes : తెలుగు వారాలలో ఆదివారం చాలా గొప్పది. సాక్షాత్తూ సూర్యభగవానుడికి సంబంధించిన రోజు. సంస్కృతంలో భానువారంగా పిలువబడుతుంది. ఇంకా చెప్పాలంటే భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఆది వారాన్ని సూర్యదేవుని పేరుతో రవివార్ గా ఇప్పటికీ పిలుస్తున్నారు. కొన్ని దేశ సంస్కృతులలో ఇది వారాంతంలో రెండవ రోజు. దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ ఆదివారాన్ని సెలవుదినంగా పాటిస్తారు. వారంలో మొదటి రోజుగా పరిగణించే ఆదివారం నాడు పాటించాల్సిన కొన్ని నియమ నిబంధనలు ఇలా ఉన్నాయి.

ఆదివారం ఉదయాన్నే సూర్య స్త్రోత్రం పఠించడంతోపాటు స్నానమాచరించి సూర్య నమస్కారం చేయడం మంచిది. సూర్య స్తోత్రం తర్వాత ఆలయ దర్శనం చేసుకుని ఎరుపు రంగు పువ్వుల‌ను స్వామికి సమర్పించడం ఉత్తమమని పండితులు పేర్కొంటున్నారు. అయితే ఆదివారం రోజు స్త్రీలు తలలో మందారం వంటి ఎరుపు రంగు పువ్వులు ధరించడం సౌభాగ్య చిహ్నమని చెబుతున్నారు.

wear Red Colour Clothes on this day for many benefits
Red Colour Clothes

అదేవిధంగా ఆదివారం ఎరుపు రంగు దుస్తుల‌ను ధరించడం శ్రేష్టమని నిపుణులు అంటున్నారు. భానువారం రోజున‌ సూర్యభగవానునికి గోధుమలు, నవధాన్యాలను నైవేద్యంగా సమర్పించినట్లైతే సకల సంపదలు దరి చేరుతాయి. గోధుమలతో తయారు చేసిన‌ వంటకాలు.. చపాతీ, పూరీ త‌దిత‌రాలను ఆదివారం రోజు భుజించినట్లైతే ఆరోగ్యదాయకమని చెబుతున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రతి ఆదివారం ఇలా చేస్తే ఆరోగ్యం ప్రాప్తిస్తుందని పండితులు చెబుతున్నారు. క‌నుక ఆదివారం రోజు ఇలా చేస్తే అన్ని విధాలుగా మేలు పొంద‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి