Vivo : మొబైల్స్ తయారీదారు వివో కొత్తగా వై20టి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్ ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం.
వివో వై20టి స్మార్ట్ ఫోన్‌లో.. 6.51 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ ఉంది. 6జీబీ ర్యామ్‌ను ఇచ్చారు. 1జీబీ ర్యామ్‌ను పెంచుకోవచ్చు. ఈ ఫోన్ వెనుక భాగంలో 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క వైపున ఉంది.
ఈ ఫోన్ లో ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 11.1 ఉంది. డెడికేటెడ్ డ్యుయల్ సిమ్, మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్లను అమర్చారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి వంటి ఇతర ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి.
వివో వై20టి స్మార్ట్ ఫోన్ ఆబ్సిడియన్ బ్లాక్, ప్యూరిస్ట్ బ్లూ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్ ధర రూఏ.15,490గా ఉంది. వివో ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు, అమెజాన్, ఫ్లిప్ కార్ట్, బజాజ్ ఫిన్ సర్వ్ ఈఎంఐ స్టోర్, ఇతర రిటెయిల్ స్టోర్స్ లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…