గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Viral Video : వామ్మో.. రైలు కింద ప‌డబోయాడు.. వెంట్రుక వాసిలో త‌ప్పించుకున్నాడు.. వైర‌ల్ వీడియో..!

Viral Video : ప్ర‌మాదాలు అనేవి చెప్పి జ‌ర‌గ‌వు. అనుకోకుండానే జ‌రుగుతాయి. అయితే మ‌నం చేజేతులా కొన్నిసార్లు చేసే పొర‌పాట్లే మ‌న‌కు ప్ర‌మాదాల‌ను తెచ్చి పెడుతుంటాయి. ప్ర‌మాదం జ‌రుగుతుంద‌ని తెలిసి కూడా కొంద‌రు వ‌ద్ద‌న్న ప‌నినే చేస్తుంటారు. అయితే…

Viral Video : వామ్మో.. రైలు కింద ప‌డబోయాడు.. వెంట్రుక వాసిలో త‌ప్పించుకున్నాడు.. వైర‌ల్ వీడియో..!

Viral Video : ప్ర‌మాదాలు అనేవి చెప్పి జ‌ర‌గ‌వు. అనుకోకుండానే జ‌రుగుతాయి. అయితే మ‌నం చేజేతులా కొన్నిసార్లు చేసే పొర‌పాట్లే మ‌న‌కు ప్ర‌మాదాల‌ను తెచ్చి పెడుతుంటాయి. ప్ర‌మాదం జ‌రుగుతుంద‌ని తెలిసి కూడా కొంద‌రు వ‌ద్ద‌న్న ప‌నినే చేస్తుంటారు. అయితే అలాంటి ప్ర‌మాదాల్లో కొంద‌రు అదృష్ట‌వ‌శాత్తూ బ‌య‌ట ప‌డుతుంటారు. అవును.. అక్క‌డ కూడా స‌రిగ్గా ఇలాగే జ‌రిగింది. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే..

Viral Video man escaped train accident very closely
Viral Video

ఓ వ్య‌క్తి రైలు ప‌ట్టాల‌ను దాట‌బోయాడు. గేట్ వేసి ఉంది. ఆగుదామ‌ని అనుకోలేదు. బైక్‌ను గేట్ కింద నుంచి ప‌ట్టాల మీద‌కు తెచ్చాడు. అయితే అనుకోకుండా అత‌ని బైక్ అదుపు త‌ప్పి కింద ప‌డింది. అయితే ఆ స‌మ‌యంలో బైక్ ప‌ట్టాల మీద ఉంది. కానీ అత‌ను ప‌క్క‌న ఉన్నాడు. దీంతో అటుగా వ‌చ్చిన రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్ ప‌ట్టాల మీద ఉన్న బైక్‌ను ఢీకొడుతూ వెళ్లింది. కొద్దిలో అయితే అత‌ను ప‌ట్టాల మీద‌కు వెళ్లి ఉంటే అత‌ను ట్రెయిన్ కింద ప‌డి ఉండేవాడు. ప్రాణాలు పోయేవి. కానీ బైక్ మాత్ర‌మే ప‌ట్టాల మీద ఉండ‌డంతో అత‌ను తృటిలో.. వెంట్రుక‌వాసిలో ప్ర‌మాదాన్ని త‌ప్పించుకున్నాడు.

ఇక ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న సీసీకెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డ‌య్యాయి. ఈ క్ర‌మంలోనే ఆ వ్య‌క్తి రైలు ప్రమాదం నుంచి త‌ప్పించుకున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అంద‌రూ అత‌న్ని విమ‌ర్శిస్తున్నారు. కాసేపు ఆగి ఉంటే కొంపలు మునిగిపోతాయా.. అంటూ నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి