Viral Video : ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. పలు చోట్ల బ్రిడ్జిలు, రహదారులు తీవ్రంగా దెబ్బ తినడంతో రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. కాగా ఉత్తరాఖండ్ లోని గౌలా నదిలో చిక్కుకుపోయిన ఓ ఏనుగును అక్కడి అటవీ శాఖ అధికారులు రక్షించారు. ఆ నదిలో ఉన్న చిన్న దీవి లాంటి భూభాగంపై ఏనుగు అటు ఇటు తిరుగుతూ ఉండగా.. దాన్ని గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు రంగంలోకి దిగి ఏనుగును రక్షించారు.
ఏనుగును రక్షించిన అనంతరం దాన్ని అడవిలో విడిచి పెట్టామని, దాని కదలికలను గమనిస్తున్నామని.. డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్‌వో) సందీప్ కుమార్ తెలిపారు. కాగా ఏనుగు వరదలో చిక్కుకుపోయిన దృశ్యాలను కొందరు తమ ఫోన్లలో బంధించారు. ఆ వీడియో వైరల్‌గా మారింది.
భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లో పలు నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు వరదల్లో చిక్కుకుపోయిన వారి కోసం సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా గౌలా నదిపై హల్‌ద్వానీ వద్ద ఉన్న బ్రిడ్జి పాక్షికంగా ధ్వంసమైంది. అలాగే చంపావత్‌లోని చాల్తి నదిపై నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి కొట్టుకుపోయింది. ఇప్పటి వరకు అక్కడ వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 16కు చేరుకుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…