టెక్నాల‌జీ

భారత్‌లోకి REDMI Note 15 Pro సిరీస్: 200MP కెమెరా, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. ధర ఎంతంటే?

భారత మార్కెట్లో రెడ్‌మీ నోట్ 15 ప్రో సిరీస్‌ను విడుదల చేసిన షియోమీ.. బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లు. Photo Credit: Xiaomi.

Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ సిరీస్‌లో REDMI Note 15 Pro 5G, REDMI Note 15 Pro+ 5G స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ప్రీమియం డిజైన్, శక్తివంతమైన హార్డ్‌వేర్, అధునాతన కెమెరా సిస్టమ్‌తో ఈ ఫోన్లు మిడ్-ప్రీమియం సెగ్మెంట్‌లో కొత్త ప్రమాణాలు సృష్టించనున్నాయి. REDMI Note 15 Pro సిరీస్ ఫోన్లకు Corning Gorilla Glass Victus 2 ప్రొటెక్షన్ ఉంది. డ్రాప్స్, బెండింగ్, క్రషింగ్‌కి తట్టుకునేలా SGS Premium Performance Certification అందించారు.

200MP కెమెరాలు..

ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఈ రెండు మోడళ్లకు IP66, IP68, IP69, IP69K రేటింగ్స్ ఉన్నాయి. అంటే 2 మీటర్ల లోతులో 24 గంటల వరకూ నీటిలో ముంచినా పనిచేస్తాయన్న మాట. Pro+ మోడల్‌లో ఫైబర్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్ ఉండటం వల్ల ఇంపాక్ట్ అబ్సార్ప్షన్ మరింత మెరుగైంది. అలాగే Wet Touch 2.0 ఫీచర్‌తో తడి చేతులతోనూ స్క్రీన్ రెస్పాన్స్ తగ్గదు. ఈ సిరీస్ హైలైట్ 200MP Samsung HPE సెన్సర్. 1/1.4 ఇంచ్ సైజ్ ఉన్న ఈ సెన్సర్ ద్వారా 2x, 4x ఆప్టికల్-లెవల్ జూమ్ సపోర్ట్ లభిస్తుంది. 23mm నుంచి 92mm వరకు ఐదు ఫోకల్ లెంగ్త్‌లు అందుబాటులో ఉన్నాయి. AI ఆధారిత ఫీచర్లు అయిన Triple-focal-length DAG HDR, AI Creativity Assistant, Dynamic Shots 2.0 (ఆబ్జెక్ట్ రిమూవల్, మోషన్ ఎఫెక్ట్స్) వంటి వాటిని ఈ ఫోన్ల‌లో అందిస్తున్నారు.

అద్భుత‌మైన డిస్‌ప్లే, భారీ బ్యాట‌రీ..

REDMI Note 15 Pro+ 5G: Snapdragon 7s Gen 4 ప్రాసెసర్, Xiaomi IceLoop కూలింగ్ సిస్టమ్ ను క‌లిగి ఉండ‌గా, REDMI Note 15 Pro 5G: MediaTek Dimensity 7400 చిప్‌సెట్ ను క‌లిగి ఉంది. ఈ ఫోన్లు Android 15 ఆధారిత Xiaomi Hyper OS 2పై పనిచేస్తాయి. Google Gemini, Circle to Search వంటి AI ఫీచర్ల‌ను సపోర్ట్ చేస్తాయి. Pro+ మోడల్‌లో Xiaomi HyperAI ని ప్రత్యేకంగా అందించారు. 6.83 ఇంచుల 1.5K OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 3200 నిట్స్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. అలాగే 3840Hz PWM డిమ్మింగ్ వల్ల కళ్లకు హాని తక్కువగా ఉంటుంది.

స్టీరియో స్పీకర్లు, Dolby Atmosతో 400 శాతం వాల్యూమ్ బూస్ట్ సపోర్ట్ ఉంది. Note 15 Pro+ 5G: 6580mAh Silicon-Carbon బ్యాటరీ, 100W ఫాస్ట్ చార్జింగ్ ను క‌లిగి ఉండ‌గా, Note 15 Pro 5G: 6500mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ చార్జింగ్ ను అందిస్తుంది. Xiaomi ప్రకారం, 1600 చార్జ్ సైకిళ్ల తర్వాత కూడా బ్యాటరీ 80 శాతం సామర్థ్యాన్ని నిలుపుకుంటుంది.

ధ‌ర వివ‌రాలు..

  • REDMI Note 15 Pro 5G కి చెందిన 8GB + 128GB ధ‌ర రూ.29,999 ఉండ‌గా, 8GB + 256GB మోడ‌ల్ ధ‌ర రూ.31,999 గా ఉంది.
  • అలాగే REDMI Note 15 Pro+ 5G ఫోన్ విష‌యానికి వస్తే, 8GB + 256GB మోడ‌ల్ ధ‌ర రూ.37,999 గా ఉంది. 12GB + 256GB మోడ‌ల్ ధ‌ర‌ను రూ. 39,999 గా నిర్ణ‌యించారు. ఇక 12GB + 512GB మోడ‌ల్ ధ‌ర రూ.43,999 గా ఉంది.
  • ఈ ఫోన్లు Amazon, mi.com, అధికారిక రిటైల్ స్టోర్లలో ఫిబ్రవరి 3 నుంచి ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉన్నాయి. HDFC, SBI, ICICI క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.3వేల వరకు డిస్కౌంట్ ను ఇస్తున్నారు.
Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

హై బీపీ ఉన్నవారు రోజుకు ఎంత ఉప్పు తినాలి? గుండెను కాపాడుకోవాలంటే ఈ రూల్స్ తప్పనిసరి!

హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…

Friday, 30 January 2026, 6:47 PM

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 418 ఐటీ ఉద్యోగాలు: ఎలా అప్లై చేయాలంటే?

దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…

Friday, 30 January 2026, 5:17 PM

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ ఓటీటీ అప్‌డేట్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…

Friday, 30 January 2026, 4:07 PM

ధురంధర్ ఓటీటీ అప్‌డేట్: బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…

Friday, 30 January 2026, 10:50 AM

తిరుమల లడ్డూ వివాదం: వైసీపీ గేమ్ ప్లాన్ ఫలించిందా? ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ!

గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…

Thursday, 29 January 2026, 10:15 PM

జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత హక్కులకు రక్షణ: ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!

సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…

Thursday, 29 January 2026, 8:27 PM

రైలులో టికెట్ లేదా? భయపడకండి.. ఈ రూల్స్ తెలిస్తే చాలు!

రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…

Thursday, 29 January 2026, 6:12 PM

ఎస్‌బీఐలో 2050 భారీ ఉద్యోగాలు: నేటి నుంచే దరఖాస్తులు.. అర్హతలివే!

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…

Thursday, 29 January 2026, 2:43 PM