Viral Video : మ‌ద్యం మ‌త్తులో పోలీస్ అధికారిని త‌న్నిన యువ‌తి.. వీడియో వైర‌ల్‌..

June 21, 2022 6:08 PM

Viral Video : ప్ర‌స్తుత త‌రుణంలో మ‌ద్యం సేవించే వారు ఎక్కువైపోయారు. పురుషుల‌తో స‌మానంగా మ‌హిళ‌లు కూడా మ‌ద్యం సేవిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు యువ‌తులైతే మ‌ద్యం మ‌త్తులో ఏం చేస్తున్నారో కూడా వారికి అర్థం కావ‌డం లేదు. పీక‌ల‌దాకా మ‌ద్యం సేవించి న‌డిరోడ్డులో హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోల‌ను గ‌తంలో మ‌నం అనేకం చూశాం. తాజాగా ఇలాంటిదే ఓ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే..

మ‌ద్యం మ‌త్తులో ఓ యువ‌తి ఓ పోలీస్ అధికారిని కాలితో త‌న్నింది. అంత‌టితో ఆగ‌లేదు. అత‌ను ధ‌రించిన మాస్క్‌ను తీసేసింది. త‌న వీడియోను చిత్రీక‌రిస్తున్న వారిపై దాడికి వ‌చ్చింది. అలాగే అక్క‌డ గుమిగూడి ఉన్న ఇత‌ర పోలీసులు, ట్యాక్సీ డ్రైవ‌ర్ల‌పై కూడా యువ‌తి దాడికి య‌త్నించింది. ఈ క్ర‌మంలోనే ఆ యువ‌తిని పోలీసులు అరెస్టు చేశారు.

Viral Video drunken girl attacked police officer
Viral Video

అయితే ఈ సంఘ‌ట‌న స‌రిగ్గా ఎక్క‌డ జ‌రిగిందో తెలియ‌దు కానీ.. వీడియోను బ‌ట్టి చూస్తే వారు మ‌హారాష్ట్ర పోలీసులు అని నిర్దార‌ణ అయింది. అయితే ఆ యువ‌తి అంత హ‌ల్ చ‌ల్ చేసినా ఆ పోలీస్ అధికారి మాత్రం ఆమెను ఏమీ అన‌లేదు. ఆమె దాడికి య‌త్నిస్తుంటే ఆమెను తోసేశాడు. అయితే త‌రువాత ఏం జ‌రిగింది.. అన్నది తెలియ లేదు. కానీ ఈ వీడియో మాత్రం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. చాలా మంది నెటిజ‌న్లు ఆ యువ‌తిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని విడిచిపెట్ట‌కూడ‌ద‌ని.. క‌ఠినంగా శిక్షించాల‌ని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment