గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Cobra Movie First Review : చియాన్ విక్ర‌మ్ న‌టించిన కోబ్రా మూవీ ఫ‌స్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Cobra Movie First Review : కోబ్రా సినిమా.. విల‌క్ష‌ణ న‌టుడు విక్ర‌మ్ నుండి రాబోతున్న 58వ‌ చిత్రం. చియాన్ విక్ర‌మ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుండ‌గా 2019లో చేస్తున్న‌ట్లు ప్ర‌కటించిన ఈ సినిమా 3 సంవ‌త్స‌రాల…

Cobra Movie First Review : చియాన్ విక్ర‌మ్ న‌టించిన కోబ్రా మూవీ ఫ‌స్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Cobra Movie First Review : కోబ్రా సినిమా.. విల‌క్ష‌ణ న‌టుడు విక్ర‌మ్ నుండి రాబోతున్న 58వ‌ చిత్రం. చియాన్ విక్ర‌మ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుండ‌గా 2019లో చేస్తున్న‌ట్లు ప్ర‌కటించిన ఈ సినిమా 3 సంవ‌త్స‌రాల త‌రువాత ఆగ‌స్టు 31న‌ ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కాబోతుంది. ఇక ఈ మూవీలో విక్ర‌మ్ హీరోగా న‌టించ‌గా, కెజిఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా చేసింది. ఇంకా ఇందులో మాజీ క్రికెట్ ఆట‌గాడు ఇర్ఫాన్ ప‌ఠాన్ ముఖ్య పాత్ర పోషించ‌గా, డైరెక్ట‌ర్ క‌మ్ యాక్ట‌ర్ అయిన కెఎస్ ర‌వి కుమార్ అలాగే రోష‌న్ మాథ్యూలు ఇత‌ర కీల‌క రోల్స్ లో న‌టించారు. ఇక ద‌ర్శ‌కుడు ఆర్ అజ‌య్ జ్ఞాన‌ముత్తుకి ఇది 3వ సినిమా కాగా ఇదివ‌ర‌కు ఇత‌ను డిమాంటి కాల‌నీ అలాగే న‌య‌న‌తారతో అంజ‌లి సిబిఐ అనే సినిమాలు చేశాడు.

ఇక విడుద‌ల‌కు ఒక‌రోజు ముందే ఈ సినిమాకి కొంద‌రు సినీ విశ్లేష‌కుల నుండి మొద‌టి రివ్యూ వ‌చ్చేసింది. వారు ఈ చిత్రం గురించి రాస్తూ.. ఈ సినిమా ఒక కొత్త భిన్న‌మైన కాన్సెప్ట్ తో, అద్భుత‌మైన ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభతో ఇంకా గొప్ప నిర్మాణ విలువ‌ల‌తో ఉంద‌ని పొగిడారు. అలాగే విక్ర‌మ్ త‌న న‌ట విశ్వ‌రూపంతో అంద‌రినీ త‌న‌వైపు తిప్పుకునేలా ఉంద‌ని కొనియాడారు. ఎన్నో మ‌లుపులు, ట్విస్టులు ఉన్న ఈ చిత్రంలో ఇర్ఫాన్ ప‌ఠాన్ న‌ట‌న కూడా ఆక‌ట్టుకుంటుంద‌ని అన్నారు.

Vikram Cobra Movie First Review know how is the movie
Cobra Movie First Review

ఇక ఈ సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే అస్లాన్ యిల్మ‌జ్ అనే ఒక‌ ట‌ర్కిష్ ఇంట‌ర్ పోల్ ఆఫీస‌ర్ కోబ్రా అనే పేరుతో ప్ర‌పంచంలోని ప‌వ‌ర్ లో ఉన్న‌ బ‌డా వ్య‌క్తుల‌ను ఎంతో చాక‌చ‌క్యంగా చంపే కాంట్రాక్ట్ కిల్ల‌ర్ ను ప‌ట్టు కోవ‌డానికి వివిధ ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తూ ఉంటాడు. అయితే కోబ్రా ర‌క‌ర‌కాల వేషాలు మారుస్తూ ఇంట‌ర్ పోల్ కి దొర‌కకుండా త‌ప్పించుకుని తిరుగుతూ ఉంటాడు. వీట‌న్నింటి వ‌ల‌న జ‌రిగే సంఘ‌ట‌న‌లే ఈ సినిమా క‌థ‌గా తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి