---Advertisement---

Vijay Devarakonda : లైగ‌ర్ మూవీకి బ‌హిష్క‌ర‌ణ దెబ్బ‌.. విజ‌య్ దేవ‌ర‌కొండ అన‌వ‌స‌రంగా కామెంట్స్ చేశాడే..!

August 20, 2022 12:02 PM
---Advertisement---

Vijay Devarakonda : బాయ్‌కాట్ బాలీవుడ్.. ఇండియాలో ట్రెండింగ్ లో ఉన్న హ్యాష్‌ట్యాగ్. ఇప్పటికే వరుస ఫెయిల్యూర్లతో ఉన్న బాలీవుడ్ ను బాయ్‌కాట్ హ్యాష్‌ట్యాగ్ మరింత టెన్షన్ పెడుతోంది. అమీర్ లాల్‌సింగ్ చడ్డా దగ్గర నుంచి అక్షయ్ రక్షాబంధన్, షారుఖ్ పఠాన్.. ఇలా టాప్ హీరోలే లక్ష్యంగా రోజుకో హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వస్తోంది. తాజాగా ఆ సెగ లైగర్ చిత్రానికి కూడా తగులుతోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం లైగర్. ఆగ‌స్ట్ 25న పాన్ ఇండియా మూవీగా ప్ర‌పంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ త‌రుణంలో లైగర్ మూవీపై కొంద‌రు నెటిజ‌న్స్ నెగెటివ్ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. అసలేం జ‌రిగిందంటే..

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత ఈ ట్రెండ్ బలంగా వినిపిస్తోంది. ఆయన మరణానికి బాలీవుడ్ హీరోలు కరణ్ జోహార్ వంటి నెపోటిజంను ప్రోత్సహించే దర్శక నిర్మాతలే కార‌ణం అంటూ కొంతమంది నెటిజెన్లు బాలీవుడ్ ను బాయ్ కట్ చేయాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అమీర్ ఖాన్‌, సల్మాన్ ఖాన్ స‌హా క‌ర‌ణ్ జోహార్‌, క‌రీనా క‌పూర్ వంటి సెల‌బ్రిటీలు బాయ్‌కాట్ బాలీవుడ్ అనే ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్‌తో ఇబ్బంది ప‌డ్డ‌వారే. అయితే తాజాగా లైగర్ సినిమా ప్ర‌మోష‌న్స్‌కు సంబంధించిన ఓ ఇంట‌ర్వ్యూలో విజ‌య్ దేవ‌ర‌కొండ దీనిపై మాట్లాడారు. లాల్ సింగ్ చడ్డా అనేది అమీర్ ఖాన్ సినిమాలో పోషించిన పాత్ర పేరు. ఆయ‌నొక్క‌డిదే సినిమా కాదు. దానిపై దాదాపు రెండు నుంచి మూడు వేల కుటుంబాలు ఆధార‌ప‌డ్డాయి అన్నారు.

Vijay Devarakonda Liger movie facing boycott hashtag
Vijay Devarakonda

అమీర్ ఖాన్‌కి విజ‌య్ దేవ‌ర‌కొండ స‌పోర్ట్ గా మాట్లాడడంతో ఇప్పుడు లైగ‌ర్‌పై కూడా నెగెటిల్ ట్రోలింగ్స్ స్టార్ట్ అయ్యాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ క‌ర‌ణ్ జోహార్ బ్యాన‌ర్‌లో లైగ‌ర్ మూవీ చేయ‌టంతో బ్యాన్ చేస్తున్నామ‌ని ఒకరంటే.. అత‌నికి ఎవ‌రితో ఎలా బిహేవ్ చేయాలో తెలియ‌దంటూ మ‌రికొంద‌రు ట్రోల్ చేస్తున్నారు. ఈ కార‌ణాల‌తో లైగ‌ర్ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ బాయ్‌కాట్ లైగర్ పేరుతో నెట్టింట తెగ ట్రోల్ చేస్తున్నారు. మ‌రి త‌మ సినిమాపై వ‌స్తున్న నెగెటివ్ ట్రోలింగ్‌పై రౌడీ హీరో విజయ్ దేవ‌ర‌కొండ అండ్ టీమ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Bhavanam Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now