5G : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. అతి త్వరలోనే దేశంలో 5జి సేవలను అందుబాటులోకి తెస్తామని అన్నారు. ఈ మేరకు ఆమె మంగళవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో కీలకప్రకటన చేశారు. పార్లమెంట్‌లో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో త్వరలోనే 5జి సేవలను ప్రజలు వినియోగించుకోబోతున్నారని ఆమె అన్నారు.
5జి సేవలను అందించేందుకు గాను ముందుగా స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియను ఈ ఏడాది నిర్వహిస్తామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అది ముగిస్తే వచ్చే ఏడాది ఆరంభం నుంచే దేశంలో 5జి సేవలు లభిస్తాయని అన్నారు. కాగా ఇప్పటికే జియో, ఎయిర్‌టెల్ వంటి సంస్థలు 5జి సేవలను అందించేందుకు కావల్సిన మౌలిక సదుపాయాలను సమకూర్చుకుంటున్నాయి. పలు చోట్ల 5జి ని ఆయా సంస్థలు ప్రయోగాత్మంగా పరీక్షిస్తున్నాయి కూడా. ఇక మొబైల్ తయారీ కంపెనీలు ఇప్పటికే 5జి సపోర్ట్ ఉన్న అనేక స్మార్ట్ ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేశాయి. దీంతో మరో ఏడాదిలో దేశంలో 5జి సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో అత్యధిక వేగంతో ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చు.
కాగా దేశంలోని అన్ని గ్రామాల్లోనూ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను నిర్మిస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. దీని వల్ల గ్రామాల్లోనూ అత్యధిక వేగంతో ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు. భారత్ నెట్ ప్రాజెక్టు కింద దేశంలోని మారుమూల పల్లెలు, గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలను మరో ఏడాదిలో పూర్తి స్థాయిలో అందిస్తామని తెలిపారు.
ఈ ఆర్థిక సంవత్సరానికి 8 నుంచి 8.5 శాతం మేర వృద్ధి రేటును అంచనా వేస్తున్నామని మంత్రి తెలిపారు. కరోనా సమయంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ ఎంతగానో కోలుకుందని అన్నారు. భారత్ అతి త్వరలోనే కరోనా కారణంగా వచ్చిన నష్టాలను భర్తీ చేసుకుంటుందని ఆశా భావం వ్యక్తం చేశారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…