Venu Swamy : చిక్కుల్లో నయనతార.. వేణుస్వామి చెప్పిందే నిజమైందిగా..!

Venu Swamy : ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ సెలబ్రెటీల జాతకాల గురించి చెప్తూ ఫేమస్ అయ్యాడు. అయితే ఆయన మాటలను ఎవరు పట్టించుకొంటారు అనే సమయంలో ఆయన చెప్పినట్లుగానే సమంత- చైతన్య విడిపోవడంతో ఒక్కసారిగా వేణు స్వామి మాటలను అందరూ నమ్మడం మొదలుపెట్టారు. అయితే నయనతార విషయంలో వేణుస్వామి  చెప్పిన విషయాలు నూటికి నూరు శాతం నిజమవుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. పెళ్లి తర్వాత నయనతార సంసార జీవితం సాఫీగా సాగదని గురువు నీచ స్థితిలో ఉండటమే ఇందుకు కారణమని వేణుస్వామి గతంలో చెప్పుకొచ్చారు.

నయనతార పెళ్లి తర్వాత ఆమె వైవాహిక జీవితంలో కలతలు వస్తాయని నయన్ విఘ్నేష్ విడిపోతారని ఆయన తెలిపారు. అయితే ఆయన చెప్పిన విధంగానే పెళ్లి తర్వాత నయన్ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటుంది. నయన్ తన పెళ్లి స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ కు ఇవ్వడంపై గతంలో నెగిటివ్ కామెంట్లు వినిపించిన సంగతి తెలిసిందే. తిరుమలలో చెప్పులు ధరించి నయన్ ఫోటోషూట్ లో పాల్గొనడం వివాదాస్పదమైంది. తాజాగా నయన్ సరోగసి ద్వారా పిల్లల్ని కనడంతో వివాదంలో చిక్కుకుంది. నిబంధనలకు విరుద్ధంగా నయనతార పిల్లల్ని కన్నారని చట్టం చెబుతోంది.

Venu Swamy

అయితే విఘ్నేష్ దీనిపై స్పందిస్తూ.. సరైన సమయంలో అన్ని విషయాలు మీకు తెలుస్తాయి, అప్పటి వరకూ ఓపికతో ఉండండి, ఎల్లప్పూడూ కృతజ్ఞతతో ఉండండి అంటూ ఇన్ స్టాలో రాసుకొచ్చాడు. నయన్ విఘ్నేష్ తప్పు చేసినట్టు ప్రూవ్ అయితే 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. నయనతార ఈ వివాదం నుంచి త్వరగా బయటపడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న నయనతార రాబోయే రోజుల్లో అయినా వివాదాలకు దూరంగా ఉంటుందేమో చూడాలి..

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM