ఎన్నో ఏళ్లుగా ఫ్లాపులను ఎదుర్కొన్న నందమూరి నట సింహం బాలకృష్ణ గత కొంత కాలంగా జోరు మీదున్నారు. అఖండ ఇచ్చిన జోష్‌తో ఇంకో హిట్ కొట్టారు. వీరసింహారెడ్డిగా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. తాజాగా వీరసింహారెడ్డి మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్‌ను కూడా నిర్వహించారు. ఇందులో నటించిన నటీనటులు సినిమా చేస్తున్నప్పుడు తమకు ఎదురైన అనుభవాలను వివరించారు. ఇక వీరసింహారెడ్డితో బాలయ్య క్రేజ్ మరింత పెరిగిందని చెప్పవచ్చు.
అఖండ ఇచ్చిన జోష్‌తో వీరసింహారెడ్డిన తెరకెక్కించారు. అంతే జోష్‌తో ఈ మూవీ కూడా హిట్ అయింది. ఇందులో బాలయ్య నటన అమోఘమనే చెప్పాలి. ముఖ్యంగా ఇందులో అధికార వైసీపీకి కౌంటర్‌గా బాలయ్య అనేక డైలాగ్స్ చెప్పారు. అయితే వైసీపీ వీటికి కౌంటర్ వేయనప్పటికీ థియేటర్స్ లో మాత్రం ఈ డైలాగ్స్ బాగా పేలాయనే చెప్పవచ్చు. ఇక ఈ మూవీలోని యాక్షన్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా వీరసింహారెడ్డి వచ్చిన సీన్లలోని ఎలివేషన్స్ ప్రేక్షకులకు బాగా నచ్చాయి. అయితే ఈ మూవీలో అందరి దృష్టినీ ఆకర్షించిన సీన్ ఒకటుంది. అదే కారును తంతే వెనక్కి వెళ్లే సీన్. ఈ సీన్ బాలయ్య అభిమానులకు నచ్చినా.. దీనిపై చాలా మంది ట్రోల్స్ చేశారు కూడా.
మూవీలో ఉన్న ఈ సీన్‌లో కారును బాలయ్య తంతే అది వెనక్కి వెళ్తుంది. అప్పట్లో వచ్చిన పలనాటి బ్రహ్మనాయుడులో ట్రెయిన్ కూడా ఇలాగే వెనక్కి వెళ్తుంది. దీంతో ఈ రెండు సీన్లను పోలుస్తూ నెటిజన్లు దర్శకుడు, నటుడిని ట్రోల్ చేస్తున్నారు. అయితే దీనిపై దర్శకుడు గోపీచంద్ మలినేని స్పందించారు. ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై వివరణ ఇచ్చారు. ఆ సీన్‌లో విలన్లు కార్‌లో ఆల్రెడీ రివర్స్ గేర్ వేసి ఉంటారు. కానీ టైర్లు బురదలో ఇరుక్కుపోవడం వల్ల కారు వెనక్కి వెళ్లలేదు. ఇక అదే సమయంలో బాలయ్య కారును తంతాడు. దీంతో బురదలో ఉన్న టైర్లు బయటకు వస్తాయి. అప్పుడు కారు ఎలాగూ రివర్స్ గేర్‌లో ఉంది కనుక వెనక్కి వెళ్తుంది. ఇదీ అసలు విషయం. ఇందులో ట్రోల్ చేయాల్సిన పనిలేదని గోపీచంద్ అన్నారు.
అయితే దర్శకుడు వివరణ ఇచ్చినా వాస్తవానికి అలా చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే అది ఆషామాషీ కార్ కాదు. బెంజ్ వి క్లాస్ కారు. అలాంటి కారును తంతే వెనక్కి వెళ్లడం అన్నది అసాధ్యం. కనుకనే నెటిజన్లు ఈ విషయంపై ట్రోల్ చేస్తున్నారు. అయితే బాలయ్య అభిమానులు మాత్రం వీటిని పక్కన పెట్టి ఆ సీన్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…