Unstoppable With NBK : మెగా నిర్మాత అల్లు అరవింద్ ఆహా అనే తెలుగు ఓటీటీ సంస్థని లాంచ్ చేసి ప్రేక్షకులకి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే అల్లు అరవింద్ వ్యాపారంలో తన వంతుగా భాగమై అన్‌స్టాపబుల్ అంటూ స్పీడు పెంచారు నందమూరి బాలకృష్ణ. ఇప్పుడు ఆ స్పీడుకు నవ్వుల రారాజు బ్రహ్మానందాన్ని యాడ్ చేయబోతున్నట్టు కొన్నాళ్లుగా వార్తలు రాగా, దీనిపై అధికారిక ప్రకటన చేశారు.
బాలయ్య టాక్ షోకు మొదటి ఎపిసోడ్ గెస్ట్‌గా డైలాగ్ కింగ్ మోహన్ బాబు హాజరై సందడి చేశారు. సీనియర్ నటులైన బాలకృష్ణ, మోహన్ బాబు మధ్య నడిచిన మాటల ప్రవాహం జనాన్ని బాగా ఆకర్షించింది. ఆ తర్వాత రెండో ఎపిసోడ్‌లో నాచురల్ స్టార్ నానితో బాలయ్య హంగామా నడించింది. ఇక ఇప్పుడు బ్రహ్మానందం వంతు వచ్చింది. బ్రహ్మీతోపాటు అనిల్ రావిపూడి కూడా జత కట్టగా, వీరు ప్రేక్షకులని ఎంతగా ఎంటర్‌టైన్ చేస్తారో చూడాలి.
అఖండ షూటింగ్‌లో జరిగిన ప్రమాదం వల్ల చేతికి గాయం కావడంతో బాలయ్య కొంత కాలం పాటు షోకి బ్రేక్ ఇచ్చారు. ఆయన కాస్త కోలుకోవడంతో గత శుక్రవారం తిరిగి షూటింగ్ షురూ చేశారు. మరింత ఉత్సాహంతో, రెట్టింపు ఎనర్జీతో బాలయ్య బాబు ఈజ్ బ్యాక్.. అంటూ ఆహా టీం అధికారిక ప్రకటన ఇచ్చేసింది. ఇక సెలబ్స్ తో బాలయ్య చేసే రచ్చ వేరే లెవల్‌లో ఉంటుందని తెలుస్తోంది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…