గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Trivikram : ద‌ర్శ‌క‌త్వం చేయ‌క‌పోయినా భారీగా దండుకుంటున్న త్రివిక్ర‌మ్..!

Trivikram : సినిమాలో ప‌దునైన మాట‌లను విసురుతూ ప్రేక్ష‌కుల‌ని ఎంట‌ర్‌టైన్ చేస్తూ ఉంటాడు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్. మొద‌ట్లో ర‌చ‌యిత‌గా రాణించిన త్రివిక్ర‌మ్ ఇప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్స్‌లో ఒక‌రిగా ఉన్నాడు. చివ‌రిగా అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో ప‌ల‌క‌రించిన త్రివిక్ర‌మ్…

Trivikram : ద‌ర్శ‌క‌త్వం చేయ‌క‌పోయినా భారీగా దండుకుంటున్న త్రివిక్ర‌మ్..!

Trivikram : సినిమాలో ప‌దునైన మాట‌లను విసురుతూ ప్రేక్ష‌కుల‌ని ఎంట‌ర్‌టైన్ చేస్తూ ఉంటాడు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్. మొద‌ట్లో ర‌చ‌యిత‌గా రాణించిన త్రివిక్ర‌మ్ ఇప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్స్‌లో ఒక‌రిగా ఉన్నాడు. చివ‌రిగా అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో ప‌ల‌క‌రించిన త్రివిక్ర‌మ్ త్వ‌ర‌లో మ‌హేష్ బాబుతో క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు. ఈ సినిమాలో ముందుగా పూజా హెగ్డేని క‌థానాయిక‌గా ఎంపిక చేయ‌గా, ఆ త‌ర్వాత స‌మంత పేరు వార్త‌ల‌లోకి వ‌చ్చింది.

Trivikram getting huge remuneration even if he is not directing movies

ఈ చిత్రానికి సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌కుడు అయినా త్రివిక్ర‌మ్ అన్నీ అయి చూసుకుంటున్నాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఒరిజినల్ కథకు పవన్ ఇమేజ్ కోసం అనేక మార్పులు చేశారట త్రివిక్ర‌మ్. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా రూ.15 కోట్లను త్రివిక్రమ్ కి ఇస్తున్నారట. దాంతోపాటు లాభాలలో కొంత పర్సెంటేజ్ కూడా ఆయనకు ఉందట. ఓ పూర్తి స్థాయి చిత్రానికి దర్శకత్వం చేస్తే వచ్చే రెమ్యూనరేషన్ కంటే అధికంగా త్రివిక్రమ్ భీమ్లా నాయక్ చిత్రానికి తీసుకుంటున్నారట.

టాలీవుడ్‌లో రాజ‌మౌళి మాత్రమే ఆ రేంజ్ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్ చేయ‌క‌పోయినా కూడా అంత మొత్తం అందుకుంటున్నాడంటే ఇది గొప్ప విష‌య‌మ‌నే చెప్పాలి. భీమ్లా నాయక్ లో మనం త్రివిక్రమ్ మార్క్ మేకింగ్ చూడవచ్చు. జనవరి 12న భీమ్లా నాయక్ ను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించగా.. ఆర్ఆర్ఆర్ నిర్మాతలు విడుదల వాయిదా వేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. చివరికి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి