Tollywood : బుల్లితెర ప్రేక్షకుల్ని ఆద్యంతం ఎంటర్ టైన్ చేసే అందమైన యాంకర్ల భర్తల గురించి చాలా రేర్ గా చెబుతుంటారు. వారికి పెళ్ళైన విషయం కూడా చాలామంది ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. అటు బుల్లితెరపై.. వెండితెరమీద తమ అభినయంతో అలరిస్తూ.. ఎంతోమంది ప్రేక్షకుల్ని సొంతం చేసుకున్న యాంకర్ల భర్తల విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం..
తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం టాప్ యాంకర్స్ లో ఒకరైన అనసూయ భరద్వాజ్ కు ఇద్దరు పిల్లలున్నారు. తన అందం, అభినయంతో హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. ఆమె భర్త పేరు సుశాంక్ భరద్వాజ్. ఆయన ఒక బిజినెస్ మన్.
నెక్ట్స్ తన చిలిపి అల్లరితో బుల్లితెర ప్రేక్షకుల్ని నవ్వించి మెప్పించిన యాంకర్ లాస్య తెలుగువారికి ఎంతో ఇష్టం. ఆమె భర్త మంజునాథ్. సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. కొన్నాళ్ళు విదేశాల్లో ఉన్నాక.. గత సీజన్ లో బిగ్ బాస్ లో రీఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తుంది. ఓ యూట్యూబ్ ఛానల్ లో కూడా తన ఐడియాస్ ని షేర్ చేసుకుంటూ ఎంటర్ టైన్ చేయడంలో మళ్ళీ బిజీగా మారింది.
టెలివిజన్ ప్రేక్షకుల్ని తన యాంకరింగ్ తో మెస్మరైజ్ చేసే యాంకర్లలో సుమ కనకాల టాప్ పొజిషన్ లో ఉంటుంది. సుమ భర్త రాజీవ్ కనకాల కూడా అందరికీ తెలుసు. సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేస్తూ గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు.
ఆ తర్వాత ఉదయభాను భర్త విజయ్. ఈయన బిల్డర్ గా వర్క్ చేస్తున్నారు. ఆమె పెళ్ళి తర్వాత మళ్ళీ టెలివిజన్ లోకి రీ ఎంట్రీ ఇచ్చినా.. అంతగా సక్సెస్ కాలేదు.
ఝాన్సీ భర్త జోగినాయుడు కూడా నటుడిగా సుపరిచితులే. యాంకర్ గాయత్రీ భార్గవ్ భర్త విక్రమ్ ఆర్మీ అధికారిగా ఉన్నారు. యాంకర్ శిల్పా చక్రవర్తి భర్త పేరు కళ్యాణ్ చక్రవర్తి. సమీరా భర్త అన్వర్ కూడా సీరియల్స్ కి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…