Tollywood : ప్రస్తుతం సినిమా రంగంలో ఓటీటీల హవా నడుస్తోంది. ఇందుకు తగ్గట్టు ప్రేక్షకుల అభిరుచులు కూడా మారుతూ వస్తున్నాయి. వారు ఓటీటీల్లో అన్ని రకాల అంశాలు, సున్నితమైన భావోద్వేగాలు, రొటీన్ కి భిన్నంగా కథ కథనాలు ఉన్న సినిమాలను, వెబ్ సిరీస్ లను ఆదరిస్తున్నారు. కానీ మన తెలుగు సినిమా దర్శకులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వరుస చిత్రాల్లో ఒకే రకమైన హీరో పాత్రలతో మూస ధోరణిలో సినిమాలు తీస్తూ పరాజయాల్ని మూటగట్టుకుంటున్నారు.
ఇదివరకు మన తెలుగు హీరోలందరూ సినిమాల్లో ఎక్కువగా పోలీస్ క్యారెక్టర్ల ని పోషించేవారు. ఒకప్పుడు అది ఒక విజయమంతమైన సినీ ఫార్ములా. కానీ ఇప్పుడు కథానాయకులందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా దర్శనం ఇస్తున్నారు. ఇది హీరో నాని నటించిన టక్ జగదీష్ తో మొదలైంది. ఇందులో ఆయన ఎమ్మార్వోగా నటించాడు. అలాగే రవితేజ రామారావ్ ఆన్ డ్యూటీ మూవీలో ఈయన కూడా డిప్యూటీ కలెక్టర్ గా, ఎమ్మార్వోగా నటించాడు. ఇక తాజాగా నితిన్ కూడా తన మాచర్ల నియోజకవర్గం సినిమాలో ఐఎఎస్ ఆఫీసర్ లా, జిల్లా కలెక్టర్ పాత్రని పోషించాడు.
అయితే తప్పంతా ఇలాంటి పాత్రలని ఎంచుకోవడంలో లేదని, ఇటువంటి పాత్రలని తీసుకున్నప్పుడు వారిని అమ్మాయిలతో డ్యాన్సులు చేస్తూ, ఫైట్లు చేస్తున్నట్టుగా, మందు తాగే వాళ్ల లాగా, రొటీన్ మాస్ మసాలా ఫార్ములా సినిమాను తీసే విధానంలోనే లోపాలు ఉంటున్నాయని సినీ నిపుణుల అభిప్రాయంగా తెలుస్తోంది. అయినప్పటికీ బోరింగ్ కథా కథనాలతో ఈ సినిమాల్లో ఏ ఒక్కటీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
అయితే ఈ విషయంలో బాలీవుడ్ సినిమాలు మన కంటే కాస్త మెరుగ్గానే ఉన్నాయని చెప్పవచ్చు. అక్కడ హీరో ఆయుష్మాన్ ఖురానా పోలీస్ డిటెక్టివ్ గా నటించిన అనేక్, ఆర్టికల్ 15 సినిమాలు మంచి విజయాలను దక్కించుకున్నాయి. రాజ్ కుమార్ రావ్ హీరోగా చేసిన న్యూటన్ సినిమాలో ఎలక్షన్ ఆఫీసర్ గా నటించి మెప్పించాడు. ఈ సినిమాల్లో వీరు బాధ్యతాయుతమైన ప్రభుత్వ అధికారుల పాత్రల్ని పోషించారు. వీరు సున్నితమైన అంశాలను ఎంతో చక్కగా చూపించి ప్రశంసలు అందుకున్నారు.
ఇది ఇలాగే కొనసాగితే తెలుగు చిత్రాలపై ప్రేక్షకులకు విరక్తి చెందే అవకాశం లేకపోలేదు. ఇకనైనా మన తెలగు దర్శకులు, నిర్మాతలు రొటీన్ మాస్ మసాలా ఫార్ములా కథలు కాకుండా సరికొత్తగా ఆలోచించి మంచి సినిమాలను అందించాలని కోరుకుందాం.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…