Thaggedele : దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్‌ల కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్‌తోపాటు రష్మిక మందన్న నటించింది. అలాగే సునీల్ నెగెటివ్ రోల్‌లో అదరగొట్టాడు. అయితే వీరందరూ ఈ మూవీలో డి-గ్లామర్ లుక్‌లో కనిపించారు. అయినప్పటికీ వారి లుక్స్ అదిరిపోయాయి. ఇక పుష్ప చిత్రంలోని పాటలు, డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. బన్నీతోపాటు రష్మిక మ్యానరిజంను కూడా ప్రేక్షకులు అనుకరిస్తున్నారు. పుష్ప చిత్రంలోని పాటలు, డైలాగ్స్ ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి.
ఇక పుష్ప మూవీలో అల్లు అర్జున్ తగ్గేదేలే.. డైలాగ్ చెప్పి అందరినీ ఎంతగానో ఉత్తేజపరిచాడు. తన ప్రతి సినిమాకు బన్నీ ఏదో ఒక డైలాగ్ లేదా మ్యానరిజంను మెయింటెయిన్ చేయడం అలవాటు. రేసు గుర్రంలో ద్యావుడా.. అనే కామెడీ డైలాగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ తరువాత పుష్పలోని తగ్గేదేలే.. డైలాగ్ కూడా అంతే పాపులర్ అయింది. దీన్ని చాలా మంది ఇప్పటికీ వాడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తున్నారు. అయితే పుష్ప చిత్రంలో ప్రేక్షకులను అలరించిన తగ్గేదేలే డైలాగ్‌ను పుష్ప 2 లో పెట్టడం లేదట. అవును.. తగ్గేదేలే అనే డైలాగ్ కేవలం మొదటి పార్ట్ సినిమాకే పరిమితమని చెబుతున్నారు.
పుష్ప 2 చిత్రంలో తగ్గేదేలే డైలాగ్ కాకుండా ఇంకో కొత్త డైలాగ్, మ్యానరిజంను పెట్టాలని దర్శకుడు సుకుమార్ ఆలోచిస్తున్నారట. అందుకనే బన్నీ చిత్తూరు యాసకు చెందిన కొన్ని డైలాగ్స్‌ను ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడట. అందువల్ల పుష్ప 2 లో మనకు తగ్గేదేలే అనే డైలాగ్ వినిపించదని తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఇది ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్న సమాచారమే. ఇందులో నిజం ఎంత ఉంది.. అన్నది తెలియాల్సి ఉంది.
కాగా పుష్ప 2 చిత్రం షూటింగ్ ఆగస్టులో ప్రారంభం అవుతుందని మేకర్స్ ఒక హింట్ ఇచ్చారు. ప్రస్తుతం సుకుమార్ స్క్రిప్టును సిద్ధం చేసే పనితోపాటు సినిమాకు గాను అవసరమైన నటీనటులను ఎంపిక చేసే కాస్టింగ్ ప్రక్రియను కూడా ఒకేసారి చేస్తున్నారట. దీంతో త్వరలోనే పుష్ప 2 షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…