Tamanna Simhadri : ప‌బ్‌కు వెళ్ల‌డం నేర‌మెలా అవుతుంది : త‌మ‌న్నా

Tamanna Simhadri : రెండు తెలుగు రాష్ట్రాల్లో రాడిసన్ బ్లూ పబ్ కేస్ సెన్సేషన్ ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. మింక్ పంబ్ లో సాగిన రేవ్ పార్టీలో అనుమానితుల లిస్ట్ లో హీరోయిన్‌, మెగా డాటర్ నిహారిక‌ కొణిదెల ఉండటం సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ఈ క్రమంలో ఎంతోమంది సినీ సెలెబ్రిటీలు నిహారిక‌కు సపోర్ట్ గా నిలిచారు. ఆమెపై మీడియా పెట్టిన‌ అధిక దృష్టిని తప్పు పడుతున్నారు. పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్ ను తీసుకు వచ్చి, బయటకు తీసుకెళ్లిన తీరు మీడియాలో రిపీటెడ్ చూపించడం, ఆమె పేరును తీవ్ర స్థాయిలో హైలెట్ చేయడం ఆమెకు, ఆమె కుటుంబానికి తీవ్రమైన ఆవేదన కలిగించింది.

Tamanna Simhadri

నిజానికి మీడియాకు.. పోలీసులు రిలీజ్ చేసిన లిస్ట్ లో నిహారిక‌ పేరు లేదు. ఆ తర్వాత నంబర్ 36 గా నిహారిక‌ పేరును చేర్చారు. ఆమె ఎలాంటి డ్రగ్స్ తీసుకోకపోయినా.. దానికి సంబంధించిన ఆధారాలు లేకున్నా.. ఆమె కూడా డ్రగ్స్ లిస్ట్ లో ఉందంటూ టార్గెట్ చేశారు. ఇది ఎంతమాత్రం సరైనది కాదని, అలా ఎలా నిహారిక‌ను హైలెట్ చేస్తారని, పార్టీకి హాజరు కావడం.. పబ్ కు వెళ్లడం నేరమా అని ట్రాన్స్ జెండర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి ప్రశ్నించారు.

ఈ క్రమంలో తమన్నా.. నిహారిక‌కు ఎంతో సపోర్టివ్ గా నిలిచారు. ఒకరిద్దరు డ్రగ్స్ తీసుకుని పార్టీకి వెళితే.. అక్క‌డికి వెళ్లిన‌ వారంద‌ర్నీ ఎలా దోషులుగా చూస్తారని ప్రశ్నించారు. నిహారిక తన ఫ్రెండ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ కు వెళ్లిందని, ఆమె ఒక సెలెబ్రిటీ కావడం వల్లే మీడియా తనను ఫోకస్ చేసిందని అన్నారు. అంతేకాకుండా మీడియాలో నిహారిక మాత్రమే పెద్ద నేరం చేసినట్లు చూపిస్తున్నారని, యూట్యూబ్ ఛాన‌ల్స్ లో కూడా ఆమెను విపరీతంగా టార్గెట్ చేస్తున్నారని అన్నారు. నిహారిక డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని అన్నారు. మెగా ఫ్యామిలీని ఉద్ధేశ్యపూర్వకంగానే ఇలా టార్గెట్ చేస్తున్నారని తమన్నా మండిపడ్డారు. మెగా ఫ్యామిలీపై ఇలాంటి దుష్ప్రచారాన్ని అడ్డుకునేందుకు తీవ్ర ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఎస్ఆర్‌హెచ్ ఓటమికి కారణం అదే.. ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ అనాలసిస్!

బ్యాటింగ్‌లో ప‌వ‌ర్ ప్లేలో ఎదురైన స‌మ‌స్య‌లు, ప్ర‌భావ‌వంతం కాని బౌలింగ్ వ‌ల్ల‌నే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) జ‌ట్టు ఐపీఎల్…

Sunday, 29 March 2026, 9:59 PM

‘బాహుబలి 2’ రికార్డులు బ్రేక్.. నిర్మాత శోభు యార్లగడ్డ రియాక్షన్ ఇదే! ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ సునామీ..

ర‌ణ్‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసి వ‌సూళ్ల‌లో దూసుకెళ్తోంది.…

Sunday, 29 March 2026, 5:33 PM

అల్లు అర్జున్‌కి డ్యాన్స్ నేర్పించింది నేనే.. రాధికా శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్!

అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యుల‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఆయ‌న‌కు డ్యాన్స్ నేర్పింది తానేన‌ని సీనియ‌ర్…

Sunday, 29 March 2026, 3:04 PM

నా పెళ్లిపై వస్తున్న వార్తలు నమ్మకండి.. క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి!

ప్ర‌స్తుతం త‌న ధ్యాస‌, దృష్టి అంతా సినిమాల‌పైనే ఉంద‌ని, ఇప్ప‌ట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేద‌ని న‌టి సాయిప‌ల్ల‌వి స్ప‌ష్టం…

Saturday, 28 March 2026, 7:37 PM

శ్రీరామ నవమి వేళ మారుతి క్రేజీ అప్‌డేట్.. ‘రాజా సాబ్’ ఫ్లాప్ తర్వాత కొత్త సినిమా!

దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు శ్రీ‌రామ‌న‌వ‌మి వేడుక‌ల‌ను ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకున్నారు. ఎక్క‌డ చూసినా శ్రీ‌సీతారాముల క‌ల్యాణ ఉత్స‌వాల‌తో ఆధ్యాత్మిక శోభ…

Friday, 27 March 2026, 7:56 PM

గుర్తింపు కోసం మహిళలు ఇంకా ఎంత కష్టపడాలి? సమంత ఆవేదన.. ‘హాలీవుడ్ రిపోర్టర్’ వేదికగా వ్యాఖ్యలు..

సినిమా ఇండ‌స్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మ‌హిళ‌ల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని, అనేక చోట్ల‌, వృత్తి జీవితంలోనూ వారు స‌ర్దుకుని పోవాల్సి…

Friday, 27 March 2026, 6:08 PM

ఐపీఎల్ 2026 కొత్త రూల్స్ ఇవే.. కెప్టెన్లకు బీసీసీఐ క్లాస్! ఆ నిబంధనలపై కఠినంగా..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో బీసీసీఐ జ‌ట్ల కెప్టెన్లు, అంపైర్లు, రిఫ‌రీల‌తో ఓ…

Thursday, 26 March 2026, 10:40 PM

ఐపీఎల్ 2026 ఫుల్ లీగ్ షెడ్యూల్ వచ్చేసింది.. మే 24 వరకు లీగ్ మ్యాచ్‌లు!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌కు గాను బీసీసీఐ పూర్తి షెడ్యూల్‌ను గురువారం (మార్చి 26, 2026) విడుద‌ల…

Thursday, 26 March 2026, 8:31 PM