Tabu : కూలీ నంబర్ వన్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన బ్యూటీ.. టబు. ఈమె తెలుగుతోపాటు హిందీ, ఇతర భాషల్లోనూ ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి చక్కని నటిగా మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఎంతో మంది సీనియర్ హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కన్నారు. కొందరు విదేశాల్లో సెటిల్ అయ్యారు. కానీ టబు మాత్రం ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. అయితే ఈమె ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదో కారణం చెప్పేసింది. ఓ హీరో వల్లే తాను పెళ్లి చేసుకోలేకపోయానని వివరించింది. ఇంతకీ ఆ హీరో ఎవరు ? అంటే..
అప్పట్లో టబు నాగార్జునతో నిన్నే పెళ్లాడతా అనే మూవీ చేసింది. అందులో వీరిద్దరి మధ్య ఇంటిమేట్ సీన్లు బాగానే ఉన్నాయి. వీరిద్ధరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే పండింది. దీంతో నాగ్, టబుల మధ్య ఏదో ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక హిందీతోపాటు తెలుగు సినిమాల్లోనూ నటించేందుకు టబు అప్పుడప్పుడు హైదరాబాద్‌కు వచ్చేది. దీంతో ఆమె నాగార్జున ఇంట్లోనే ఉండేది. ఈ క్రమంలోనే వీరిమధ్య ఏదో నడుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అదేదీ నిజం కాదని టబు కొట్టి పారేసింది.
ఇక అప్పట్లో అజయ్ దేవగన్ తాను ఎక్కడకు వెళ్లినా తనను ఫాలో అవుతుండే వాడని, తనను ఏ యువకుడు చూసినా వారికి వెళ్లి వార్నింగ్ లు ఇచ్చేవాడని తెలియజేసింది. ఈ క్రమంలోనే అజయ్ దేవ్ గన్ వల్లనే తాను ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉన్నానని చెప్పి షాకిచ్చింది. అంతే కాకుండా తాను చిన్నపిల్లలా ప్రవర్తిస్తుంటానని.. ఈ క్రమంలోనే అజయ్ దేవ్ గన్ కూడా తనను అలాగే చూసుకునేవాడని టబు చెప్పింది. అయితే మరి అంతలా కలసి మెలసి ఉన్న ఇద్దరూ ఎందుకు పెళ్లి చేసుకోలేదు, అజయ్ దేవ్ గన్ కాజోల్‌ను ఎందుకు వివాహమాడాడు ? అన్న వివరాలపై మాత్రం టబు స్పష్టతను ఇవ్వలేదు. బహుశా ఇద్దరికీ బ్రేకప్ అయి ఉంటుందని.. కనుకనే ఆ డిప్రెషన్‌లో టబు ఇక పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుందని సమాచారం. ఏది ఏమైనా.. టబు గురించి టాపిక్స్ అప్పుడప్పుడు ఇలా వైరల్ అవుతుంటాయి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…