Swetha Reddy : పిల్ల సైనిక్స్ ఇప్పుడేమంటారు.. నాగ‌బాబు నీతులు చెప్ప‌డం మానుకోవాలి.. శ్వేతా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

Swetha Reddy : రెండు రోజుల క్రితం బంజారాహిల్స్‌లో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. స్థానిక రాడిసన్ బ్లూ హోటల్‌లో రేవ్ పార్టీ జరుగుతోందని పక్కా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఆదివారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో జరిగిన ఈ దాడుల్లో దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌తోపాటు మెగా డాటర్ నిహారిక కూడా ఉండటం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

Swetha Reddy

అయితే ఈ ఇష్యూపై యాంకర్, బీజేపీ మహిళా నేత శ్వేతారెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. డ్ర‌గ్స్ క్యాంపెయిన్‌లో నీతిబోధ చేసిన చిరంజీవి ఆ వీడియోను తన కూతురు నిహారికకి చూపించడం మరిచిపోయారో.. లేదంటే ఆమెకు చూడ్డానికి ఖాళీలేదో తెలియదు కానీ.. మెగాస్టార్ మాత్రం చాలా అద్భుతంగా స్పీచ్ ఇచ్చారు మహానుభావుడు.. ముందు ఈ వీడియోను ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు చూపించాలి. ఆ తరువాత జనానికి చెప్పాల్సింది. డైలాగ్‌‌లు, స్పీచ్‌లు వాళ్ల ఫ్యామిలీలో ఉన్న వాళ్లకి చూపిస్తే బాగుండేది. ఎప్పుడూ బయట ఆడవాళ్లపైన కామెంట్లు చేసే పిల్ల సైనిక్స్ ఎవరైతే ఉన్నారో.. వాళ్ల పరిస్థితి ఊహించుకుంటేనే నాకు జాలి వేస్తోంది.

నిహారిక పాప.. తప్పతాగి డ్రగ్స్ తీసుకుని స్టేషన్‌లో ఉందని క్రైమ్ రిపోర్టర్‌లు మెసేజ్‌లు పెడుతున్నారు. నాకు కూడా చాలా మెసేజ్‌లు వచ్చాయి. డ్రగ్స్ మాఫియా మళ్లీ షురూ అయ్యిందని.. హిందీ, ఇంగ్లీష్‌లలో కూడా న్యూస్ వస్తోంది. ఎప్పుడూ నిజాలు మాట్లాడే నిఖార్సైన నా లాంటి ఆడవాళ్లపై ఎగేసుకుని పడిపోయే జనసేన తమ్ముళ్లూ.. అన్నలూ.. ఏం చేస్తారో చూస్తుంటే నాకు జాలి వేస్తోంది.

చెప్పేవి శ్రీరంగ నీతులు.. దూరేవి ఆ గుడిసెలు.. అన్న‌ట్లు.. మనం నీతులు చెప్పడం కాదు. పార్టీలు పెట్టి.. పోస్టర్లు పెట్టి ఎగేసుకుని పడిపోవడం కాదు.. సూక్తులు చెప్పేముందు.. క్యారెక్టర్ గురించి బ్యాడ్‌గా మాట్లాడే ముందు.. ఇంట్లో ఉన్న కూతుళ్ల‌ గురించి మాట్లాడుకోవాలి. మెగా ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు పాపలు ఉన్నారు. ముందు వాళ్ల గురించి ఆలోచించాలి కదా.. ఇంట్లో ఆడ‌వాళ్ల‌ని కంట్రోల్ లో పెట్టుకోవాలి క‌దా.. అంటూ విరుచుకు ప‌డ్డారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో…

Wednesday, 18 March 2026, 8:13 PM

బాక్సాఫీస్ వద్ద రణవీర్ సునామీ.. విడుదలకు ముందే ‘ధురంధర్ 2’ రూ.153 కోట్ల వసూళ్లు!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ధురంధ‌ర్ 2 చిత్రం విడుద‌ల‌కు ముందే బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తోంది. ఈ…

Wednesday, 18 March 2026, 5:54 PM