Samantha : ఎట్ట‌కేల‌కు నాగ‌చైత‌న్య ఫొటోను షేర్ చేసిన స‌మంత‌..!

Samantha : టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్ నాగ చైత‌న్య, స‌మంత గ‌త ఏడాది అక్టోబర్ 2న త‌మ విడాకుల విష‌యం ప్ర‌క‌టించి పెద్ద షాక్ ఇచ్చారు. వీరు తీసుకున్న నిర్ణ‌యానికి ప్ర‌తి ఒక్క‌రూ షాక‌య్యారు. అక్కినేని నాగచైతన్య, సమంత ఇద్దరూ ఇష్టపడి పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ 2021 మే నెల నుంచి వారిద్దరూ విడిపోతున్నారు అంటూ ప్రచారం జరిగింది. దాదాపు మూడు, నాలుగు నెలల ప్రచారం అనంతరం నాగచైతన్య, తాను అధికారికంగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము.. అంటూ సమంత తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

Samantha

అప్ప‌టి వ‌ర‌కు ఎంతో అన్యోన్యంగా ఉంటూ వచ్చిన వారిద్ద‌రూ ఉన్న‌ట్లుండి విడిపోతున్నామంటూ ప్ర‌క‌టించ‌డంపై ఫ్యాన్స్ స‌హా సినీ లోకం ఆశ్చ‌ర్య‌పోయింది. అయితే వారిద్ద‌రూ ఎందుకు విడిపోతున్నారో ఎక్క‌డా బ‌య‌ట‌కు చెప్ప‌లేదు. విడిపోయిన త‌ర్వాత ఇద్ద‌రూ వారి వారి లైఫ్‌ల‌ను లీడ్ చేస్తున్నారు. ఎక్క‌డా ఒక‌రిపై మ‌రొక‌రు బ‌హిరంగంగా విమ‌ర్శ‌లు చేసుకోలేదు. చైతూ నుండి విడిపోయిన త‌ర్వాత స‌మంత ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేసిందే త‌ప్ప ఎక్క‌డ కూడా చైతూ గురించి మాట్లాడింది లేదు. కానీ తాజాగా త‌న ఇన్‌స్టా పోస్ట్‌లో మ‌జిలీ పోస్ట‌ర్ షేర్ చేస్తూ.. మ‌జిలీకి 3 ఏళ్లు అంటూ తెలిపింది.

పోస్ట‌ర్‌లో చైతూ సీరియ‌స్ లుక్‌లో క‌నిపిస్తుండ‌గా.. పైన క‌నిపిస్తున్న వాటిలో ఇద్ద‌రూ చాలా ఆప్యాయంగా క‌నిపిస్తున్నారు. ఆటోన‌గ‌ర్ సూర్య‌, మ‌నం త‌ర్వాత ఈ ఇద్ద‌రూ క‌లిసి న‌టించిన‌ చిత్రం మ‌జిలీ. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన మజిలీ విమర్శకులు, ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంది. అనుకోని పరిస్థితుల కారణంగా విడిపోయిన ఓ జంట చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. ఆ మ‌ధ్య ఓ ఇంటర్వ్యూలో చైతూ త‌న బెస్ట్ పెయిర్ స‌మంత అని చెప్పిన విష‌యం తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో…

Wednesday, 18 March 2026, 8:13 PM

బాక్సాఫీస్ వద్ద రణవీర్ సునామీ.. విడుదలకు ముందే ‘ధురంధర్ 2’ రూ.153 కోట్ల వసూళ్లు!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ధురంధ‌ర్ 2 చిత్రం విడుద‌ల‌కు ముందే బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తోంది. ఈ…

Wednesday, 18 March 2026, 5:54 PM