Surekha Vani : టాలీవుడ్ లో గ్లామర్ ఉన్న అతికొద్దిమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో సురేఖా వాణి కూడా ఒకరు. హీరో హీరోయిన్ లకు అక్క, వదిన క్యారెక్టర్ లు చేస్తున్నా.. హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోని అందం సురేఖ వాణిది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో బిజీ బిజీగా సురేఖావాణి ఎమోషనల్ సీన్ లు కామెడీ సీన్లలో సైతం నటిస్తూ నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు కాస్త సినిమాలకు దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ తో టచ్ లోనే ఉంటూ వస్తోంది. ఆమె కుమార్తె సుప్రీతకు కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటీవలే సుప్రీత బర్త్ డే సెలబ్రేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చూశాం.
అయితే ఇటీవల సురేఖావాణి, తన కూతురు సుప్రీతతో కలిసి యూట్యూబర్ నిఖిల్ షోకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె పలు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సుప్రీత మాట్లాడుతూ.. నాకొక బాయ్ ఫ్రెండ్ కావాలి అంటే.. నాక్కూడా ఓ బాయ్ ఫ్రెండ్ కావాలన్నారు సురేఖా వాణి. అంతేకాదు మంచి మనస్సు ఉన్న వ్యక్తి అయ్యి ఉండి.. హైట్ అండ్ నైస్ ఫిజిక్ ఉండాలన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సురేఖావాణి సినిమాల విషయానికి వస్తే.. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన రెడీ, బాద్‌షా వంటి సినిమాలు సురేఖా వాణికి మంచి గుర్తింపును తీసుకువచ్చాయి.
కరోనా ఇతరత్రా కారణాలతో సినిమాల్లో అవకాశాలు తగ్గినా సురేఖా వాణి ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలు చేస్తోంది. ఆ మధ్య బిగ్‌బాస్ 6లో పార్టిసిపేట్ చేస్తోందంటూ వార్తలు వచ్చాయి. కానీ సురేఖా వాణి.. స్టార్ మా వాళ్లు ఎంత ఆఫర్ చేసినా.. ఆ షోలో పాల్గొనని తెగేసి చెప్పేసిందట. తాజాగా ఈమె కూతురు సుప్రీత నాయుడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందా లేదా అనే విషయంపై స్పందించింది. ప్రస్తుతం సుప్రీత చదువుపై దృష్టి పెడుతోంది. దాంతో పాటు ఆమె నటనలో, డాన్సుల్లో ఓ గురువు దగ్గర ప్రత్యేక శిక్షణ తీసుకుంటోందని చెప్పుకొచ్చింది సురేఖావాణి. దీన్నిబట్టి సుప్రీతను టాలీవుడ్ లో హీరోయిన్ గా త్వరలోనే చూడబోతున్నాం అన్నమాట.
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…