Colors Swathi : కలర్స్ ప్రోగ్రామ్ తో బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది అందాల తార స్వాతి. అందుకే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తనకెంతో గుర్తింపునిచ్చిన ఆ ప్రోగ్రామ్ పేరునే తన ట్యాగ్‌గా మార్చుకుంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన డేంజర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత సుబ్రహ్మణ్యపురం, అష్టాచెమ్మా, గోల్కోండ హైస్కూల్, స్వామిరారా, కార్తికేయ, త్రిపుర తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అయితే సినిమా కెరీర్ మంచి పీక్స్‌లో ఉండగానే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. 2018లో ఆమె తన స్నేహితుడు వికాస్ వసును వివాహమాడింది.
ఆ తర్వాత మళ్లీ సిల్వర్ స్ర్కీన్‌పై దర్శనమివ్వలేదు. ఆ మధ్య మళ్లీ కార్తికేయ సీక్వెల్ తో మళ్లీ ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరిగినా అవి ఊహగానాలేనని తేలిపోయింది. వెండితెర అవకాశాలు మిస్ అవ్వడానికి కారణం స్వాతి అనే చెప్పాలి. సినిమా అంటేనే ఓ గ్లామర్ ప్రపంచం ఇందులో నెట్టుకు రావాలంటే హీరోయిన్లకు కేవలం టాలెంట్ మాత్రమే కాదు.. అందం, అదృష్టం ఉండాలి. ఇలా అన్నీ ఉన్నప్పటికీ కలర్స్ స్వాతి మాత్రం అవకాశాలను అందుకోలేక ఇండస్ట్రీకి దూరమైంది. స్వాతి కెరీర్ లో మొదట్లో పలు సినిమా అవకాశాలు రావడంతో తాను ఇలాంటి తరహా పాత్రలలోనే నటించాలని ఓ గీత గీసుకుంది. ఇలా తన కంఫర్ట్ జోన్ దాటి సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే వాటిని ఆమె సున్నితంగా తిరస్కరించింది.
ఇలా ఓవైపు అవకాశాలను కోల్పోవడమే కాకుండా మరోవైపు తన గ్లామర్ విషయంలో కూడా ఈమె జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణంగా తెలుస్తోంది. కలర్స్ స్వాతి వయసులో చిన్నది అయినప్పటికీ తన ముఖ కవళికలు మాత్రం చాలా వయసున్న అమ్మాయిలా కనబడుతుంది. అయితే ఈమె తన గ్లామర్ పై దృష్టి పెట్టకపోవడం మరో కారణంగా చెప్పవచ్చు. స్వాతి చేసిన చిన్న చిన్న తప్పుల వల్లే ప్రస్తుతం ఎలాంటి అవకాశాలు లేకుండా ఇండస్ట్రీకి దూరమైందని తెలుస్తోంది. ఎప్పటికైనా స్వాతి తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…